పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 4] బిళ్వమంగళ 67

అతని నెక్కడ వెతకుదును? ఈ పాడుశరీరము నాకు శత్రువైనదే!

(పిచ్చిది వచ్చును)

పిచ్చి - అమ్మా! అమ్మా! నేను నిన్ను చూస్తూనే ఉన్నాను... అదిగో... నక్క లీడుస్తూతింటూన్నవి-చూడు, చూడు-నేనూ కడుపునిండా తిన్నాను-పశువులు క్రిములు పక్షులూ ఆన్నీ ఆలాగే తింటూన్నవి... అదే-అదే-చూడు.

చింతా - మాయింటికి వస్తావా?

పిచ్చి - రాను-ఇక నింటికి రాను - అత డక్కడ లేడు- నీ అల్లుడు....వెర్రివాడు...ఇంట్లో లేడు... శ్మశానములో ఉన్నాడు! ఇక నింటికి రాను-అదంతా శూన్యము!

చింతా - నిజమే-ఇంటికి పోవడమన్న భయము వేస్తూంది.

పిచ్చి - అమ్మా! విషము, విషము-మగవాడూ ఆడదీ ఆలోచించుకున్నారు. సముద్రమధనము చూడబోయినారు-విషము... విషము-నీవు నావెంట రా. విషము తాగలేవు! సంసారసముద్రమథనం చేస్తే విషము వెలువడుతుంది. హరుడూ గౌరీ చూడబోయినారు. ఎరుగుదువా?

బిచ్చ - ఓహో! ఇది వెర్రిది కాదు-దీనిమాటలన్నీ నిజము. (పిచ్చిదానితో) నీ, వెవర్తె వమ్మా? (చింతామణితో) ఈమెమాటలు నిజము సుమా! ఈమె ఎవర్తెయో మహాత్మురాలు.