పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 61

జిహ్వా! నీవు హరిభజన మొనర్చుతూండు. (కళ్లుమూయును)

(అహల్యా, దాసియువత్తురు)

దాసి - అమ్మా! ఇత డొక ఉచ్ఛిష్టభోజ.

అహ - ఆలాగనకు. సాధువులా గున్నాడే-చూడు-జపము చేస్తున్నాడు.

దాసి - ఈతని కున్మాద మమ్మా! చూపుతా నుండు. ఓరి పిచ్చివాడా! అన్నము తింటావా?

బిల్వ - ఓహో! స్వర్గానికివెళ్లినా సవతిపోరే అన్నట్లు ఇక్కడికి వచ్చినా ఏకాంతమైన చోటు లేదాయెనే?

(అహల్యనుచూచి) కన్నులారా! ఏమి మీపొగరు? మానసమా, ఈమూఢచక్షువులకు దాసి వవుతూన్నావా? చాల్చాలు, నీబుద్ధి! దృష్టినిమరల్చు.

దాసి - అమ్మా! అదిగో పిచ్చివాడు నిన్నేకాగ్ర దృష్టితో చూస్తున్నాడు. ఇక్కడ మన ముండరాదు-నడువు-వీడికన్నులు చింతనిప్పులలాగు వేపచిగుళ్లవలెనూ ఎర్రవారినవి..(పోదురు)

బిల్వ - కన్నులారా, నన్నెంతకాలము మీదాసునిగా చేయగలరో చూస్తాను-(వారి వెంటనే పోవును)

దాసి - అమ్మయ్యో! పిచ్చివాడు మనవెంటే పడ్డాడు. త్వరగానడువు, నాకుభయము వేస్తూన్నది!

అహ - అతనియూసు మనకెందుకు? మనదారిని మనము పోదాము. (పోవుదురు)