పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50 బిల్వమంగళ [అం 3

ఇంకొకడు, విటులకోసము వెతకనక్కరలేదు. నీవే ఆలోచించుకో.

చింతా - సరే కాని పిచ్చిదాని వృత్తంత మేమైనా తెలిసిందా?

దాసి - తెలియ కేమి? అది కలయింటిబిడ్డ, తల్లిదండ్రులుగానీ ఇతరబంధువులుగానీ లేరు. యోగ్యునకే యిచ్చి పెళ్ళిజేసినారు. అల్పకాలముననే పాప మతడు మృతుడయ్యెను, అప్పటినుండీ ఈ మెకు పిచ్చియెత్తింది.

చింతా - ఈ కథ నీ కేలాగు తెలిసింది?

దాసి - నాకు తెలియదా? మావీధిలోనే దానియిల్లు. ఎప్పుడూ అక్కడే తిరుగుతూంటుంది. పడుచువారి కంటపడితే బాధపెట్టుతూంటారు. ఇదిగో, యిక్కడికే వస్తూన్నది.

చింతా - ఈమె సాధారణపు పిచ్చిదికాదు. పరమాత్మునిచేత వంచింపబడి నాలాగేయింటినుండి వెడలగొట్టబడ్డది.

(పిచ్చిది వచ్చును)

పిచ్చి - పరమాత్మునికి నాపై దయలేదని యెంచుతూన్నారా? ఆతని కందరిపైనీ కృపయున్నది. ఏమో నాయెడ మాత్ర మింకా దయరాలేదు. నన్ను మరచినాడేమో? ఎప్పటికైనా ఉద్ధరించితీరును.

చింతా - అమ్మా! నీ వెవతెవు? సాక్షాజ్జగదంబవా?

పిచ్చి - ఔనమ్మా, ఆ యభాగ్యురాలను నేనే. అంతటా నీకామెయే కనబడుతూన్నదా? ... మాటాడ కూరు