పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అంకము

________

మొదటి రంగము

(నడుతోవలో బిల్వమంగళుడు)

బిల్వ - కానీ, కానీ, కానీ, ఇంత టెక్కా! ఒక్క క్షణ మాలస్య మయిందని నడురేయిదాకా తలుపు తీయనేలేదు. ఇందేదో ఉంది, రాత్రి నాకు కళ్ళు మూతపడనే లేదు ఒక్క మాటైనా దానినోట రాలేదు. ఒత్తిగిలి ఆవల మోమై హాయిగా నిద్రపోయింది! ఇక దీని మొగము చూస్తే నాపేరు బిల్వమంగళుడు కాదు - చెప్పకుండా వచ్చినాను చేటు మానింది...నేటితో సరి. ఎప్పుడైనా కంటపడితే ఆ రెండు మాటలూ చెప్పి తీరవలెను. పరుషముగా వద్దు, సరళముగానే. వదలుకో దలచినప్పుడు వైర మెందుకు? "అమ్మాయీ, కుడువవా? ముడువనా? నీకా లాభములేదు, నాకూ లగ్గులేదు, నేటితో సరి, ఇంతే"... విడిచి వచ్చినతరువాత మరి పోను.