రం 3] బిల్వమంగళ 19
సాధు - ఆహా! ఏమి మధుర గానము!
బిచ్చ - నీ వెవతెవు? ఎటు పోతున్నావు?
పిచ్చి - నేనా - వెర్రిదాని కూతురిని - పిచ్చిదానిని.
బిచ్చ - నీకు పెళ్ళి అయిందా?
పిచ్చి - ఆహా! పిచ్చివానికి నన్నిచ్చినారు! (పోవును)
సాధు - దీనిని పట్టుకో - చక్కగా పాడుతుంది.
బిచ్చ - మనపని బాగానే సాగుతుంది.
సాధు - నీకు కూడా అష్టాంగసిద్ధి అలవడునే!
బిచ్చ - ఆలాగైతే నేనింకోశిష్యుని వెదకుకోవలెను-
మూడో రంగము
(బిల్వమంగళుడు శ్రాద్ధముపెట్టుచుండ పురోహితుడు మంత్రము చెప్పుచుండును)
బిల్వ - ఇదిగో మీకీ స్వయంపాకము పితృప్రీతికై ఇస్తున్నాను. సూర్యాస్తమయము కాబోతూన్నది, మీ మంత్రము ముగిసేటట్టు లేదు.
పురో - ఆలస్యము మీదే - మీబోటి యజమాను లిద్దరు దొరికితే ఇక మా జరుగుబాటు కేమికొదవ? నిమంత్రితులైన బ్రాహ్మణులు ఉపవాసముచేత స్రుక్కినారు.
బిల్వ - నేను షడ్రసోపేతముగా బోజనము చేస్తినా?
పురో - మీరు వైదికకర్మల నిట్లాచరిస్తే మిమ్మల్ని వెలివేస్తారు.
బిల్వ - కోపపడకకండి, లోనికి పోయి సమారాధన