పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120 బిల్వమంగళ [అం 5

                      స్త్రీ హత్య సంక్రమిం ♦ చిన నూర్ధ్వ!గతులున్నె?
                              దక్కవు నీకు నన్ ♦ దయజూడకున్న.
                      నీవు క్షమించిన ♦ నేవత్తు త్రిదివంబు,
                              ఇద్దర మట నుంద ♦ మీక్షణము లట్ల.
                      పరితాప భరమున ♦ పాపము ల్కడచనె,
                              కృపచేసి చూపుమా-కృష్ణు కళ్లారన్||

బిల్వ - ఆహా ! శ్రీకృష్ణనామ మెవ రుచ్చరించినారు! (చింతామణిని పోల్చి) ఓహో! ఏమది! నాగురువు! ప్రేమశిక్షాదాతా! విశ్వమోహినీ! నన్ను కరుణింపుము. (నమస్కరించును.)

చింతా - ప్రభూ ! ఇంకా వంచనయేనా ? - ప్రేమ మయా! యోగివర్యా! ప్రేమ స్వరూపుడగు భగవంతుడు నీవద్ద నున్నాడు. నిన్నేమడిగిన నది యిచ్చెదవని నాగురువు నా కుపదేశించెను. నీకృష్ణుని నాకిమ్ము - ఇవ్వడమున కిష్టము లేకుంటే నీవద్దనే నిల్పుకొని నాకొక్కసారి చూపించుము. పాపాత్మురాల - పతితపావను సందర్శనము నాకు కల్గించుము.

బిల్వ - కృష్ణునియందే నీచిత్తము జొత్తిల్లిన కాని నీకు దర్శనము కాదు. అది సాధకమున చేకూరును కాని ఒకరిస్తే లభించేది కాదు.

చింతా - నా హృదయము ప్రేమ శూన్య పాషాణము. యోగివరేణ్యా! శ్రీకృష్ణుడు నాకు చిక్కు టెలాగు?

బిల్వ - భక్తిచే సకలమూ సిద్ధించ గలదు.