రం 4] బిల్వమంగళ 105
బిల్వ - అన్నా ! నీ వెక్కడనాకు ఎదురుచుక్కలాగు దాపురించినావు! నిన్ను వదలుకో లేను! చక్కినుంటే చావమివ్వవు !
గోపా - నీకు బృందావనము పోవలెనని లేదా ? నడువు-పోదాము.
సనకాది యోగిసుతు-జనకాది యోగినతు
కనక వసనాలంకృ-తుని గాంతు వచటన్.
బిల్వ -
బృందావనమున కేగుదుము-అట-కందర్పజనకుని గాంచుదము||
ప్రేమధామమునుజేరుదము-మన-కామిత ఫలముల గాంచుదము
యమునాపులినమునరయుదము-అనయము గో-పాలునిపాడుదము
ఆలమందలనుగాయుదము-వన-మాలాధరుతో నాడుదము
గోపబాలు నటగూడుదము-మన-పాపసంచయముబాయుదము||
కృష్ణకృష్ణయని కేరుదము-మన-తృష్ణల దీర్పగ వేడుదము||
పార్థసారథిని పాడుదము-పురు-షార్థములన్నిటి బడయుదము||
ఈషణత్రయమును వీడుదము-భక్త దూషణసరులత్యజించుదము
యుక్తులన్నిటి నొలయుదము-అల-ముక్తిసతీమణి ముట్టుదము.
(పోబోవును)
గోపా - అటు కాదు, బృందావన మిటుంది. (త్రిప్పును)
బిల్వ -
కందు మల బృందావనంబును-అందమున నగునందనంబు-ము
కుందపదరాజీవరంజిత-సైకతస్థలముల్||