పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 85

(లోపల - తీయరేమి? మేము పోలీసువాళ్ళము)

దాసి - అన్నా! ఏమి గతి? కొంప మునిగిందిరా దేవుడా!

(లోపల - తలుపు బద్దలు చేయనా? తీస్తారా?)

సాధు - చూడు - ఇది నాయజమానురాలి సొత్తని నేనంటాను, నీవాలాగే సాక్ష్యమియ్యి.

(పోలీసు ఇన్స్‌పెక్టరు, జవానులు వత్తురు.)

దాసి - ఇనస్పేటు బాబూ! దొంగ! దొంగ!

ఇన - ఔను. ఈయింట చోరీ జరిగిన ట్లున్నది.

దాసి - బాబూ! ఈమనిషి. ఇనప్పెట్టె తవ్వుతున్నాడు.

ఇన - మేము రావడము చూచి "దొంగ" అని కేక వేసినావు. మంచిది (సాధువుతో) నీ వెవడవు!

సాధు - నేను చింతామణి పెంపుడు కొడుకుని. ఇదంతా ఆమెసొత్తు. నా కామె యిచ్చింది.

ఇన - తాళముచెవులు నీవద్ద నున్నావా?

1 జవా - లేనట్టే-ఉంటే పగులగొట్టడ మెందుకు?

ఇన - నీ వూరకుండు. తాళముచెవు లెక్కడ?

సాధు - (స్వ) ఓహో! ఇతడు నన్ను విచారణచేస్తూన్నాడు!

ఇన - వీరిద్దరినీ తీసుకొనిపోయి, వీడిని చెరలోనూ, దానిని గదిలోని ఉంచండి-ఈ యిల్లంతాశోధించి వస్తాను.

దాసి - బాబూ! దండములు-ఈమనిషి దొంగతనా