పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 బిల్వమంగళ [అం

(భిక్షకుడు పాడుతూ వచ్చును.)

తోడిరాగము - (వెడలెను కోదండపాణి వరుస)

                      వలపవెడు తుపానులోన - చెలగు జీవమను నావ !
                      కలగు హృదిని కల్లోలము - కాంచ గాంచ మించెనయ్యో||వల||
                      ఏడ ప్రాణములు చేర్చునొ - ఎవ్వ డెరుగు దైవమాయ?
                      నుడివడు పెనుసుడిలోబడి - బడలిక మునుగ,
                      జడమురీతి జరుగుచుండు - జగమంతయు దిగులునొందు,
                      నడలులేక రాగలతిక - సందడించు చున్నదయ్యో ||వల||

బిల్వ - ప్రాణాలు నిల్చునట్లు లేదు.

బిచ్చ - బాబూ, దిక్కుమాలిన పక్షిని-ధర్మం చేసుకోరా?

బిల్వ - పోపో - నాప్రాణాలుతీయకు..ఏమిటాపాటా? సందడిస్తున్నదా?

బిచ్చ - ఆకలిచేత పేగులు బిగబట్టుతూన్నవి.

బిల్వ - ఆపాట నాకు చెప్పు, వ్రాసుకొంటాను.

బిచ్చ - ఒక్కచోట నుండిపోతే కడుపు నిండుతుందా బాబూ? నాలుగువీధులూ తిరిగితే కదా నాలుగిజ్జంజలు దొరకుతాయి.

బిల్వ - ఒకక్షణ మాగు - నీకేమైనా యిస్తానులే.

బిచ్చ - అంతమాటే చాలు - నాకేమీ వద్దు బాబూ!

బిల్వ - ఆలాగుకాదు - పాట వ్రాసుకోనిస్తే నీకు రూపాయి యిస్తాను.