పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 3] బిల్వమంగళ 43

బిల్వ - నావా రెవ్వరూ లేరా? ఉన్నారు, లేకేమి? అంధకారమున నరయలేకున్నాను. ఉన్నారు, నాదగ్గరే ఉన్నారు. లేకుంటే, దుర్వారతరంగిణీమధ్యమున శవమును జారవిడిచిన దెవరు? క్ష్వేళవహ్నియైన కుండలి కరవకుండా నన్ను కాచినవా రెవరు? - నావారు లేరని అన్నవా రెవరు? ఇపుడు నాతో ఆత్మీయుడను అని చెప్పినవా రెవరు? ... నీ వెవడవు? నీరూపమెట్టిది? నీ వతిసుందరమూర్తివి ! ఒక్కసారి కంటపడవా? పోనీ ఎక్కడ నుందువో చెప్పు... నా ప్రాణాలు పోతూన్నవి... నాదగ్గరనే ఉన్నావు; నే నంధుడను కావున కాంచలేకున్నాను. నాకళ్ళు విప్పేవా రేరీ? ...నే నెక్కడికి పోవుదును?.. (పోవును)

చింతా - ఎక్కడికో పోతూన్నాడు-విరాగి అయ్యెనా ఏమి? అతనివారు లేనప్పుడు నావారు మాత్ర మున్నారా? చూస్తాను. (పోవును)

దాసి - చిత్రముగా ఉంది వీళ్ళచర్య.. (పోవును)