పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 31

దాసి - నాసంగతి నీవెరుగవు-పురుషుని చూడగానే గుణము పోల్చగలను. దేవతార్చనము చేయక నీరైనా తాగను. నాయం దనుగ్రహించి నాయింటికి వచ్చినవానిని నాధునిగా భావించి పరపురుషుని కన్నెత్తిచూడను. ఈరీతిగా ఇరవైరెండేళ్ళూ ఒక్కరిపోషణమందే కాలక్షేపము చేసినాను.

సాధు - నాభావము నీకవగతము కాలేదు-నే నుంచు కోవడముమాట ఎత్తలేదు-ప్రేమవిషయము పల్కుతున్నాను.

దాసి - కావచ్చును. ఆడదానను గనుక విశదముగా చెప్పినకాని బోధపడదు.

సాధు - అట్లైతే - రెండుమాటలలో తెల్పుతాను. నేను నిన్ను రాధగా చూచుకొంటాను, నీవు నన్ను కృష్ణుని గా నెంచుకో. పిదప నీకిష్టమువచ్చినట్లు చేసినా పాపముండదు... రాధ వవుతావా?

దాసి - మీమాట నాకు తెలియలేదు.

సాధు - రాసరసమయివై నా రాధవు కా, నీకుప్రణయకోపము వచ్చుని, నీపాదములు పట్టి నే నలక తీర్చుతాను...నేను వేణుగానము చేసెదను, నీవు "ఏడీకృష్ణుడు? కృష్ణుడేడీ?" అని సొక్కిసొలసిసోలుతావు...తెలిసిందా?

దాసి - నీవు నన్ను పోషింపగల్గితే అన్ని ఆట లాడుతాను. కూటికీ గుడ్డకీ యిచ్చిన చాలును. పరుండడానికి పరుపక్కరలేదు, చాపైనాసరే-నగలుపెట్టినా మానినా ఏమీఅనను.

సాధు - నేను బ్రహ్మచారిని, సామంతుడను కాను.