పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24 బిల్వమంగళ [అం 1

హృదయము తల్లడమంద ♦ ఎద నాసలు వడి డింద, చిత్తకమలముకు హేళి ♦ హత్తియుండు వనపాళి

రాదె సైకతశ్రోణి ♦ ఏది? యేది? చింతామణి?

బిల్వ - (నవ్వి) ఇ దెవతె? చింతామణి నెందుకు పిలుస్తూన్నది? ... ఇది భూతము కాదు, మానవగణములోనిదే? పిచ్చిదానివలెనుంది. నీవెవతెవు? చింతామణి నీ కేమవుతుంది?

పిచ్చి - చింతామణి నాది. పేరుపెట్టి పిలువకూడదు - సిగ్గు కాదా?

బిల్వ - అది ఆడదాని పేరు కాదా?

              పిచ్చి - చింతామణియె నాదు ♦ చిన్నారిచిలుక
                                ముక్తకేశిని అయ్యు ♦ ముద్దుల కిరవు
                        కలుముల యిల్లాలు ♦ కట్టదు బట్ట;
                                వరమిచ్చి వెతదీర్చు ♦ వరశుభమూర్తి
                        సంతతంబును నామె ♦ శవముపై నాడు;
                                రేపల్లెవాడలో ♦ వ్రేవెలందులకు
                        వేణునాదము తాను ♦ వినిపించు నెపుడు;
                                శిరమున జడలు నం ♦ బరములీ దిశలు
                        ఉండునొకప్పు డా ♦ వెండిమల మీద
                                 తాండవమాడుచు ♦ తద్ధిమ్మియనుచు;
                        ప్రతిమయై ప్రేమయే ♦ ప్రభవింప నోపు:
                                 రాసకేళులలోన ♦ రమియించుబాల,
                        ఉవిదలలోనెల్ల ♦ యుడుపతిరాణి,