పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20 బిల్వమంగళ [అం 1

సరిగా జరుగుతూన్నదో లేదో చూడండి - రామా!

(అతడు వచ్చును)

వడ్డన వాళ్ళ నిటు రమ్మను - (ఆతడుపోయి వచ్చి)

రాము - అయ్యా వడ్డనయింది - వడ్డన వాళ్ళు వస్తూన్నారు.

బిల్వ - సరే, నీవుపోయి అయిదు గిన్నెలలో అన్ని పదార్థములూ ఉంచుమను. అయ్యా - మీరు దయచేయండి - దేవతార్చనపెట్టె లోపలికి గొనిపొండి, రామా, నీవూ వెళ్ళు.

పురో - అబ్బో? ఇంత తెలివియున్నదా? (ఇద్దరూ పోదురు)

బిల్వ - అయిదు చాలునా? ఏదీ, - చింతామణి, దాసి - యిద్దరు - దాసి కోముసలమ్మ, చింతామణి కొకర్తె - నాకొకటి - ఐదు - నే నక్కడే తింటాను - అబ్బా! పశ్చిమాన మేఘావరణ ముందే! గాలివాన వచ్చునేమో? ... ఏమి యురుములు, ఏమి మెరుపులు! (రాముడు వచ్చును)

రాము - అయ్యా! బ్రాహ్మణులకు వడ్డించిన అన్నములో ధూళిపడ్డదని వాళ్ళు లేచిపోతా మంటున్నారు.

బిల్వ - దానికి నేనేమి చేయగలను? - ఐదు గిన్నెలూ సిద్ధమైనవా? వాటిని పడవల రేవుకి చేర్పించు - నేను దొడ్డిలోకి పోతాననే మిషపెట్టి బయటికి దాటుతాను. నన్ను గురించి ఎవరైనా అడుగుతే జ్వరము వచ్చిందని చెప్పు - వీ డెవడు? (గుమస్తా వచ్చును)