పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18 బిల్వమంగళ [అం 1

హేనురూపాయిలు పంపించవలెను. మా అమ్మ, నాభార్య, ఇద్దరుపిల్లలూ ఉన్నారు. వాళ్ళఖర్చులు పోగా మిగిలినదానిలో నాకు పదివంతులు, తక్కినవి నీవి.

బిచ్చ - మీకు సాధువుల మర్యాద తెలియనట్లుంది - శిష్యునికీ గురువుకూ భాగము సమానము కావలెను.

సాధు - దానికేమిలే - నీవు నాకు శిష్యుడవైన చాలు. నీకుతోచిన గురుదక్షిణ మాకర్పిస్తూ ఉండు.

బిచ్చ - అదీ మేలైనమాట!

సాధు - నేటిరాత్రి చిన్నపని ఉంది.

బిచ్చ - నాకుకూడా కొంచెము పనిఉంది.

సాధు - ఒకర్తెయింటికి నేను పోవలెను.

బిచ్చ - నేనుకూడా ఒకచోటికి పోవలెను.

సాధు - అద్దరినా?

బిచ్చ - మరేమీ?

సాధు - సరే - నేడే దానిని ముగించుకో -

(పిచ్చిది పాడుతూ వచ్చును)

సింహేంద్రమధ్యమరాగము - (నతజన పరిపాలయ - వరుస)

                      ఎటనుందువొ - ఎరుగనునీ - విటురాగదే - మాఅమ్మ
                      కటకట పల్కరాదా నే - నిటుల మొరలనిడుచుబిల్వ ||నెట||

పోనీ నాయనను పిల్తునా? అబ్బబ్బా, ఎవరూ పల్కరు - పాషాణి తల్లి పాషాణమే కదా? - అమ్మా, అమ్మా - ఒక్క సారి కంటపడవా?