పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 బిల్వమంగళ [అం 1

చింతా - అయితే కోపముపడక తిన్నగా ఇంటికి పద.

బిల్వ - ఇప్పుడు రాను. నేడు మాతండ్రి తద్దినము. వేళ మీరుతున్నది.

చింతా - అట్లైన ఆలస్య మెందుకు? కోపములేదని చెప్పి ఇంటికిపో.

బిల్వ - ఆఁ కోపమెందుకు?

చింతా - ఆలాగు కాదు. ఇటు విను. ఇప్పటికే పొద్దెక్కింది. "నాకుకోపము లేదు" అని నీవనేదాకా నిన్ను పోనీయను.

బిల్వ - నాకు కోపము లేదు.

చింతా - సరే, ఇక నింటికి పో; నేను స్నానానికి పోతాను; త్వరగా ఏరు దాటు - సాయంకాలము వత్తువా? - కాదు, కాదు - నే డేరు దాటరాదు కదా?

బిల్వ - అట్లైన నన్నెట్లు రమ్మంటావు?

చింతా - నేడొద్దు - రేపుదయము రా - రాకుంటే ఒట్టు సుమా!

బిల్వ - రేపేలాగు రాగలను?

చింతా - చూచినావా దాసీ నీ ఉదారుడు ! నేడు పోతున్నాడు, ఈరాత్రి కంట పడడు, రేపుదయమైనా రా జాలడట! .. కోపమే లేదట? కోపము నాకులేదు, ఉన్నమాట అన్నాను.

బిల్వ - ప్రొద్దుటే ఎట్లు రాగలను? కోపముతోనన్న