పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రం 1] బిల్వమంగళ 9

చింతా - నే నేమన్నాను ! నీ వింట్లోలేవు - నేను భోజనము చేస్తున్నాను, అందుచేత ఆలస్యమయింది... ఆపాటి దానికి రాత్రిఅంతా గొణగొణలే, మాటాలేదు, మంతీలేదు. నన్ను నిద్రపోనివ్వలేదు, తెల్లవారేదాకా నిష్ఠూరాలే! ఒళ్ళుమండి నేను మాటాడలేదు - వెంటనే మేడదిగినాను ఆతనికీ నాకూకోపము వచ్చింది. రెండు మూడుసార్లు తిరిగీ వచ్చెను, కాని నేను పల్కరించలేదు.

బిచ్చ - అదిగో - ఆచెట్టుక్రింద నున్న యాతడేనా?

దాసి - ఎక్కడ?

బిచ్చ - (చింతామణితో) ఇదిగో విను - (దాసితో) నీవుకాదు. అతడు వచ్చు ననుకొంటున్నారు కాబోలు ! అతడికరాడు.

చింతా - ఎక్క డున్నాడు?

బిచ్చ - ముందు నీయింటికి పద - నీ వేమిచేస్తున్నావో చూడవలెను, ఏలాగు భోజనము చేస్తావో గాంచవలెను, ఏమందువో వినవలెను; అప్పుడు మర్రిచెట్టుదరికి పోయి ఆ మాటలు చెప్పవలెను. అద్దరి నాత డున్నాడు - (బిల్వమంగళుడు పొదలో దూరును).

చింతా - దాసీ, చూడుచూడు - ఆపొదలో దాగు కొన్నాడే!