పుట:Bilva Mangala, Sri Pada Kameswara Rao.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98 బిల్వమంగళ [అం 4

అహ - నీవుకూడా మావెంట వత్తువా ?

గోపా - ఆఁ.

అహ - (స్వ) ఈ బాలకుని ఎత్తుకొని ముద్దాడవలెనని యున్నది. (ప్ర) మీఅమ్మ యే మంటుందో?

గోపా - నాకు తల్లీ లేదు తండ్రీ లేడు.

అహ - మీయి ల్లెక్కడ బాబూ?

గోపా - గోపకుల యింటగోవులు కాచుతూంటాను.

అహ - ఇంత చిన్నవాడవు! గోవులను కాయగలవా.

గోపా - ఆహా.

అహ - నిజముగా నీ కెవ్వరూలేరా?

గోపా - మీరే నాకు తల్లిదండ్రులు.

అహ - ఆలాగా? ఏదీ పిలువు అమ్మా అని.

గోపా - అమ్మా! అమ్మా!

వర్త - పాపము, దిక్కులేని పసివాడు.

గోపా - నాకు నేనే దిక్కు, ఇం కెవ్వరూ లేరు.

వర్త - మేము నేడే బృందావనము పోతాము?

గోపా - మరీ మేలే!

వర్త - నీవుకూడా బృందావనము రావడమెందుకు?

గోపా - నా కోచిక్కు ప్రాప్తించింది.

వర్త - ఏ దది?

గో - అందువల్ల గోవులు కాయలేను, ఆడుకోలేను, బృందావనమునకు పోలేను! నన్ను బృందావనము మీతో