పుట:Bibllo Streelu new cropped.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలాసార్లు కాలు సేతులు కడుకొనేవాళ్లు. అలా కడుగుకోడానికి ఏటినీరు బాగా ఉపయోగపడేది. కనుక వాళ్లు యేటి గట్టునే ప్రార్థనా స్థలంగా జేసికొన్నారు. పౌలు బోధచేయడానికి వెళ్లిన రోజు స్త్రీలు ఎక్కువ సంఖ్యలో ప్రార్థనకు వచ్చారు.

అలా వచ్చినవారిలో లూదియా వొకతె. ఈమె అద్దకం వేసిన కెంపురంగు పట్టుబట్టలను అమ్మూతూండేది. సంపన్నురాలు. యూదుల తెగకు చెందని అన్యజాతి స్త్రీ, వారంవారం యూదుల ప్రార్ధనా సమావేశానికి వచ్చి వేదపఠనాలనూ వాటిమీద బోధకులు చెప్పే వివరణనూ వింటూండేది. కొందరు అన్యజాతి ప్రజలు యూదమతం పట్ల అభిమానం చూపేవాళ్లు. ఆ మతంలో చేరకపోయినా యూదుల ప్రార్ధనా సమావేశాలకు హాజరౌతుండేవాళ్లు. లూదియా ఈలాంటిది.

అంతవరకు లూదియాకు తెలిసింది పూర్వవేదంలోని యావే ప్రభువు మాత్రమే. ఇప్పుడు ఆమె పౌలు బోధించే క్రీస్తుని గూర్చి కూడ వింది. పూర్వవేద బోధలను వినడానికి అలవాటు పడిన ఆ భక్తురాలు ఇప్పుడు క్రీస్తుని గూర్చిన బోధలను అర్థంజేసికొంది. ఆ ప్రభువుని విశ్వసించి అతన్ని రక్షకుణ్ణిగా అంగీకరించింది. ఆమె హృదయం విత్తనం పడిన సారవంతమైన భూమిలా తయారైంది -మత్త 13,8.

లూదియా పౌలు బోధను జాగ్రత్తగా వింటూంటే ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. సజీవమైన ప్రభువువాక్కు ఆమె హృదయాన్ని తెరిచింది - హెబ్రే 4, 12. ఇక్కడ హృదయాన్ని తెరవడమంటే విశ్వాసాన్ని పుట్టించడమని భావం. అనగా లూదియా క్రీస్తుని గూర్చి వింటుంటే తండ్రి ఆమె హృదయాన్ని ప్రేరేపించి ఆమె క్రీస్తుని విశ్వసించేలా చేశాడు. పవిత్ర గ్రంథం దేవుడు కన్నులు తెరచాడు (కీర్తన 119,18) చెవులు తెరచాడు (యెష 50,5) హృదయాలు తెరచాడు అని గూడ చెప్తుంది. ఈ మూడు ప్రయోగాల భావం వొకటే, విశ్వాసం పట్టడం. పౌలు బోధవల్ల లూదియాకు క్రీస్తుపట్ల విశ్వాసం కలిగిందని ఫలితార్థం

మామూలుగా సంపదజ్ఞికి ఒకే వ్యక్తికి వుండవు. కాని