పుట:Bibllo Streelu new cropped.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు సాన్నిధ్యం మరియు యింటిలో నెలకొని వుండాలి - మత్త 18,20. సోదరులంతా కూడి ఐకమత్యంతో జీవించడం చాల రమ్యమైంది అన్న కీర్తన వాక్యంకూడ ఆ యింటికి అక్షరాల వర్తించివుండాలి -133,6.


కొందరు వ్యాఖ్యాతల భావాల ప్రకారం, పూర్వం క్రీస్తు అంత్య భోజనాన్ని భుజించిన యిల్లు ఇదే -లూకా 22, 10-13. ఆత్మ దిగిరాకముందు అపోస్తులంతా కలసి ప్రార్ధన చేసిన మీదిగది ఈ మరియు యిల్లే -అ.చ. 1,13-15. యూదాకు బదులుగా మత్తీయాను పండ్రెండవ శిష్యునిగా ఎన్నుకొనిన తావు కూడ యిదే -1, 15-26. పవిత్రాత్మ శిష్యులమీదికి దిగివచ్చిన యిలు కూడా యిదే -2, 1–4. ఈ యభిప్రాయాలే నిజమైతే మరియు యిల్ల చాల పవిత్ర గృహమై యుండాలి. మామూలుగా యూదుల ఇండ్లు చిన్నవి. ఒక్కగది మాత్రమే కలిగి వుండేవి. దీనికి భిన్నంగా మరియు గృహం పెద్దది అనుకోవాలి. దానిలో కనీసం రెండు గదులు, రోడ్డువైపున ఇంటికి ప్రహరీగోడ వున్నాయి అనుకోవాలి.


హేరోదు పేతురుని చెరలో పెట్టించినపుడు అతని కోసం ప్రార్ధన చేసిన భక్త సమాజం కూడ ఈ యింటిలోనే ప్రోగయింది అనుకోవాలి. ఈ ప్రార్ధనా ఫలితంగానే దేవదూత పేతురుని చెరనుండి విడిపించాడు -అ.చ. 12, 5.


ఆనాటి మరియు గృహంలోలాగే నేడు మన గృహాల్లో కూడ భక్తులు ప్రోగయి బైబులు పఠించి ప్రార్థన చేసికొంటే ఎంత బాగుంటుంది! నేడు అక్కడక్కడ మౌలిక సంఘాల సభ్యులు కొందరు భక్తుల యిండ్లల్లో గుమిగూడి ప్రార్థనలు చేస్తున్నారు. ఇది చాల మంచి పద్ధతి. ఇరుగు పొరుగు వాళ్లు కూడి ప్రార్ధన చేసికోవడం కంటె గొప్ప ధన్యత మన యింటికీ ఏముంటుంది? మన యిండ్లు, మన యితర భవనాలు కూడ భక్తులను చేరదీసేవిగా వుండాలని కోరుకొందాం. మరియు హృదయంలాగే మన హృదయంకూడ పదిమందికి ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చేదిగా వుండాలని ఆశిద్దాం. దైవప్రజలు వచ్చినపుడు మన యింటినీ మన హృదయాన్నీ కూడ తెరచివుంచుదాం.