పుట:Bibllo Streelu new cropped.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

45. యోహాసు తల్లి మరియు - అచ.1212-17

దేవదూత తన్ను చెరనుండి అద్భుతంగా విడిపించాక పేత్రు మరియు ఇంటికి వచ్చాడు. ఈమె మార్కు అనే మారుపేరుకల యోహానుకి తల్లి, సువిశేషాన్ని వ్రాసిన మార్కు ఇతడే. ఈ మార్కు ఇతని తల్లీ బర్నబాకు దగ్గరి చుట్టాలు.

మరియు విలువ ఈ బంధుత్వాన్ని బట్టి రాలేదు. ఆమె తనంతట తాను యోగ్యురాలు. భక్తురాలు. తిరుసభ తొలిరోజుల్లో ఆమె తన యింటినే ఓ చిన్న తిరుసభగా మార్చి వేసింది. కనుకనే లూకా మరియను గౌరవ పూర్వకంగా జ్ఞాపకముంచుకొని ఆమె పేరును తన గ్రంథంలో లిఖించాడు.

తొలినాటి క్రైస్తవులు ప్రార్థన చేయడానికి ప్రసంగాలు వినడానికీ యెరూషలేము దేవళానికి వెళ్లేవాళ్లు. కాని వాళ్లు కొన్ని గృహాల్లో కూడ ప్రోగై జపం చేసుకొనేవాళ్లు. అపోస్తుల బోధ వినేవాళ్లు. దివ్యసత్ర్పసాదాన్ని స్వీకరించేవాళ్లు -అ.చ. 2,46-47. ఈ యిండ్లు గృహదేవాలయాలు అనాలి. లవోదికయలోని నుంఫా అనే గృహిణి యిల్లు ఈలాంటిది - కోలో 4,15. రోములోని అక్విలా ప్రిసిల్లా దంపతుల యిల్లు ఈలాంటిది -రోమా 16.3-5. ఫిలిప్పి లోని లూదియా యిల్లు ఈలాంటిది -అ.చ. 16, 40. యెరూషలేములోని మరియు యిలుకూడ ఈలాంటి గృహదేవాలయమే. దానిలో చాలమంది భక్తులు చేరి ప్రార్ధన చేసి కొంటుండేవాళ్లు -అ.చ. 12, 12. చెరనుండి విడుదల పొందిన పేతురు ఈ భక్త సమాజాన్నికలసికోవడానికే నేరుగా మరియు యింటికి వచ్చాడు.

ఈలా భక్తబృందానికి ఆశ్రయమిచ్చిన మరియు కొన్ని యిబ్బందులకు గురై యుండాలి. యెరూషలేములో తొలినాటి క్రైస్తవులను యూదులు హింసిస్తూండేవాళ్లు. కనుక మరియకూడ కొన్నిసార్లు బాధలకు బెదిరింపులకు గురైయుండాలి. ఆమె తన యింటికి వచ్చిన వాళ్లకు అన్న పానీయాలు సరఫరా చేసివుండాలి. ఆ భక్తులు తమ శ్రమలను గూర్చి చెప్తుంటే జాలితో వినివుండాలి. నా పేరుమీదిగా ఇద్దరు ముగ్గురు సమావేశమైన చోట నేనూ వుంట్లాన్లు అన్న వేదవాక్యం ప్రకారం ఉత్థాన