పుట:Bibllo Streelu new cropped.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చదువుకొనేప్పడు క్రీస్తే కంఠమెత్తి తన వాక్కుని మనకు వినిపిస్తాడు. అగస్టీను భక్తుడు వాకొన్నట్లుగా, సువిశేషం క్రీస్తు కంఠం. ఆనాడు పాలస్తీనాదేశపు పల్లెల్లోను పట్టణాల్లోను గొంతెత్తి బోధించిన ప్రభువు ఈనాడు సువిశేష గ్రంథంలో వుండి మనకు మళ్లీ బోధచేస్తాడు. తన వాక్కుని మనకు విన్పిస్తాడు. బెతనీ మరియలాగ మనం ప్రభువు బోధలను వింటాం. కనుకనే బైబులు వాక్కును చదువుకొంటున్నా బైబులు బోధను వింటున్నా మనకు నేడు కూడ భక్తి పడుతుంది.

పూర్వమే చెప్పినట్లు వాక్యం కూడ మనకు భోజనమే. మనం దివ్యసత్ర్పసాదంతో పాటు వాక్యాన్ని గూడ ఆహారంగా భుజించాలి. సత్ర్పసాదమూ వాక్కూ రెండూ కలసి మనకు పరిపూర్ణ జీవాన్ని ప్రసాది స్తాయి. నేడు మనపూజలో మొదట వాక్యాన్ని ఆహారంగా భుజిస్తాం. పూజలో మొదట రెండు వేదపఠనాలు వింటాం. వాటిపై గురువు చెప్పే వివరణం వింటాం. ఈ విధంగా మొదట వాక్యాన్ని ఆహారంగా భుజిస్తాం. అటుపిమ్మట గురువు నడిపూజలో అప్పరసాలను ఆశీర్వదించి వాటిని క్రీస్తు శరీర రక్తాలనుగా మారుస్తాడు. వీటిని దివ్యసత్ర్పసాదంగా మనకు వడ్డిస్తాడు. ఇది రెండవ భోజనం. మొదట వాక్యభోజనం, ఆ పిమ్మటనే దివ్యసత్ర్పసాద భోజనం. మనం ఈ రెండిటినీ ఆరగించాలి. కేవలం దివ్యసత్ర్పసాద భోజనం మాత్రమే చాలదు.


వాక్యాన్ని చదువుకోవడంలో, వినడంలో, ధ్యానించుకోవడంలో బెతనీ మరియు మనకు ఆదర్శంగాను ప్రేరణంగాను వుంటుంది.


ప్రభువు పాదాలను అభిషేకించిన వ్యభిచారిణి మరియు మగ్డలీన కాదని చెప్పాం. అలాగే ఆమె మార్త చెల్లెలు మరియు కూడ కాదు. ఈమె సన్యాసిని. మౌనంగా, ధ్యానాత్మకంగా జీవించిన భక్తురాలు. ఐనా యోహాను సువిశేషం భ్రాంతితో ఈమెను వ్యభిచారణిగా చిత్రించింది - 12, 1,8. ఇది పొరపాటు.