పుట:Bibllo Streelu new cropped.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధ్యానాత్మురాలినిగా, చిత్రిస్తుంది. మరియు ప్రభువు పాదాల చెంత కూర్చుండి అతని వాక్యాన్ని శ్రద్ధతో ఆలిస్తూంది. క్రీస్తు పరలోకంలోని తండ్రినిగూర్చీ, దైవారాజ్యాన్ని గూర్చీ చెప్తుంటే మరియు విశ్వాసంతో వింటూంది.

మరియు ప్రభువు పాదాల చెంత కూర్చుంది అంటుంది సువిశేషం. పాదాల చెంత కూర్చోవడమంటే శిష్యురాలు కావడం. యూదుల మగపిల్లలు రబ్బయి పాదాల ಮಿಟ್ಟು కూర్చుండి అతడు బోధించే ధర్మశాస్తాన్ని వినేవాళ్లు. ఆ ధర్మశాస్తాన్ని నేర్చుకొని తర్వాత వాళ్లు కూడ రబ్బయులు అయ్యేవాళ్లు. కనుక పాదాల చెంత కూర్చోవడమంటే శిష్యులు కావడం. ఇక్కడ మరియు ప్రభువుకి శిష్యురాలయి అతని బోధలు వింది. దైవవాక్కులు శ్రద్ధతో ఆలించింది. ఆ వాక్కులు సూచించే తండ్రిని ధ్యానం చేసికొంది. మౌనంగా, నిదానంగా ప్రభువు వాక్యం ధ్యానించు కోవడం ఆమె పద్ధతి. ఆమె ధ్యానహృదయ, మననశీల.

యోహానుకి “క్రీస్తు ప్రేమించిన శిష్యుడు” అని పేరు. కడపటి విందులో అతడు క్రీస్తు వక్షఃస్థలానికి దగ్గరగా కూర్చున్నాడు –యోహా 13.23. ఈ యోహానునిలాగే మరియను కూడా క్రీస్తు ప్రేమించిన శిష్యురాలు అని పిలవాలి.

ప్రభువు మరియు భక్తిని మెచ్చుకొని ఆమెను ప్రేమించాడు. కనుకనే మరియు ఉత్తమమైన కార్యం ఎన్నుకొంది, అది ఆమె నుండి తీసివేయ బడదు అని చెప్పాడు -10,42. మరియు ఎన్నుకొన్న ఉత్తమైన కార్యం దైవ వాక్యాన్ని వినడం. పరలోకంలోని తండ్రిని ధ్యానించు కోవడం. ఆమెకు ఆ భాగ్యం నిరంతరం వుంటుంది. ఆమె ఏనాడు దాన్ని పోగొట్టుకోదు.

బైబులు భక్తులందరికీ బెతనీ మరియు ఆదర్శంగా వుంటుంది. ఆమెలాగే మనం కూడ రోజు కాసేపు పవిత్ర గ్రంథం ముందు కూర్చుండి దాన్ని భక్తితో చదువుకోవాలి. దాని బోధలను వినాలి. మనం బైబులు