పుట:Bibllo Streelu new cropped.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు మార్తతో అమ్మా నీవు ఎన్నో పనులను గూర్చి విచారిస్తూ ఆందోళన పడుతున్నావు. ఇన్ని వంటకాలు అక్కరలేదు. ఏదో మామూలు భోజనం వండి వడ్డించు. తిని వెళ్లిపోతాం అన్నాడు. ఇంకా ప్రభువు అవసరమైన కార్యం ఒక్కటుందన్నాడు. మరియు ఉత్తమమైన కార్యాన్ని ఎన్నుకొందన్నాడు. దీని భావమేమిటి?

మార్త అన్న పరిచర్యలో నిమగ్నమై వుంది -10,39. అన్నం తయారు చేయడం వడ్డించడం మంచిదే. కాని దైవ వాక్యాన్ని వినడం 3OSo శ్రేష్టమైన కార్యం. పని మంచిదే. కాని భగవంతుణ్ణి ధ్యానించు కోవడం ఇంకా ఉత్తమమైంది.

ఇక్కడ ప్రభువు మార్తను మందలించలేదు, చీవాట్లు పెట్టలేదు. మార్త హృదయంలో తనపట్ల వున్న భక్తిభావం ప్రభువుకీ తెలుసు. తనకు ప్రేమతో భోజనాన్ని తయారుచేసే భక్తురాలిని ప్రభువు మందలిస్తాడా? ఇక్కడ క్రీస్తు ఉద్దేశమిది. భోజన పరిచర్య లాంటి లౌకిక సేవలు చేయ వలసిందే. కాని వాటితోపాటు దైవారాధనంలో గూడ పాల్గొనాలి. వాక్యాన్ని ధ్యానించుకోవాలి.

ఈ సందర్భంలో ఇంకొక లోతయిన భావం కూడా వుంది. మార్త ప్రభువుకి భౌతిక భోజనం వడ్డించబోతూంది. ఆమె అదే ముఖ్యమనుకొంది. కాని క్రీస్తు మరియా మార్తలకు వాక్యభోజనం వడ్డించబోతున్నాడు. ముందు ఈ భోజనాన్ని భుజించాలి. ఇది భౌతికాన్నం కంటే శ్రేష్టమైన ఆహారం.

నేడు మనం కూడ మార్తలా శ్రమించి పనిచేయవలసిందే. క్రైస్తవ సమాజానికీ, ప్రభువుకీ నానావిధ పరిచర్యలు చేయవలసిందే. కాని మనం మరియలాగ ప్రభువు వాక్యాన్ని కూడ వినాలి. ఆరాధనంలో పాల్గొని ఆ వాక్యాన్ని ధ్యానించుకోవాలి. పనీ దైవారాధనా రెండూ కలసిపోతూండాలి. సత్రియలూ విశ్వాసమూ రెండూ ఉండాలి.

43. మరియు -లూకా 10,39

మార్త చెల్లెలు వురియుస్తు సువిశేషం భక్తురాలినిగా,