పుట:Bibllo Streelu new cropped.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84+7+14=105 అన్నారు. అది పూర్వవేదంలో వితంతువైన యూదితు వయస్సు - యూదితు 16,28. ఏమైతేనేమి, బైబులు భావాల ప్రకారం వృద్ధాప్యం దేవుని దీవెనను సూచిస్తుంది.

అన్నా అనేది గ్రీకు రూపం. దానికి హీబ్రూ మూలం హన్నా హీబ్రూలో ఆ మాటకు దైవానుగ్రహం అని అర్థం. అన్నా తండ్రి ఫానువేలు. అతనిది ఆషేరు గోత్రం.

అన్నా సిమియోను ఇద్దరు దైవ ప్రేరితులై దేవాలయానికి వచ్చి, క్రీస్తు శిశువుకి సాక్ష్యం పలికారు. ఇద్దరూ క్రీస్తు కొనిరాబోయే రక్షణాన్ని గూర్చి మాట్లాడారు. యూదుల భావాల ప్రకారం ఒకరి సాక్ష్యం చెల్లదు. కనుక లూకా యిక్కడ ఇద్దరి సాక్ష్యాన్ని వివరించాడు. లూకా సువిశేషంలో మామూలుగా ఓ పురుషునితోపాటు ఓ స్త్రీ కూడ వుంటుంది. ఉదాహరణకు సిమియోను అన్నా జకరియా ఎలిసబేతు, సరెఫా విధవ నామాను, శతాధిపతి నయీను విధవ, గొర్రెను కోల్పోయిన కాపరి నాణాన్ని కోల్పోయిన స్త్రీ మొదలైనవాళ్లు దేవుని దృష్టిలో, రక్షణ చరిత్రలో స్త్రీ పురుషులిద్దరు సమానమని అతని భావం. మన అన్నాకు పూర్వవేదంలోని సమూవేలు తల్లి అన్నాకు కొన్ని పౌలికలున్నాయి. ఇద్దరూ పలుసార్లు దేవళానికి వచ్చి దేవుణ్ణి సేవించారు. 1 సమూ 1,24. పూర్వవేద కాలంలో కొందరు స్త్రీలు దేవళంలో పరిచర్యలు చేసేవాళ్లు నిర్గ 38,8. అన్నా ఈ కోవకు చెందింది. ఆమె దేవాలయం చెంతనే వుండిపోయేది. ఉపవాసాలతో, ప్రార్థనలతో రేయింబవళ్లు దేవుని సేవలో మునిగివుండేది -237. ప్రార్థన ఉపవాసం దానధర్మాలు మూడు యూదుల భక్తికి మూలస్తంభాల్లంటివి. అన్నా చాలకాలం పాటు వితంతువుగా వుండిపోయిందన్నాడు లూకా. పూర్వం యూదితుకూడ అలాగే వుండిపోయింది. యూది11, 22. ఇంకా ఆమె నూతవేదంలోని వితంతువులకు కూడ ఆదర్శంగా వుంటుంది -1తిమో 5, 5. అన్నా ప్రవక్రీ. పూర్వవేదంల్లో ప్రురుషప్రవక్తలే గాక స్త్రీ ప్రవక్తలు -*