పుట:Bibllo Streelu new cropped.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని విస్తుపోయాడు. ఇప్పడు దైవమందసంలాంటి మరియు ఎలిసబేతు దగ్గరికి కదలి వచ్చింది. ఆ దైవమందసంలో దేవుని సాన్నిధ్యమున్నట్లే ఈ దైవమందసమైన మరియలో క్రీస్తు సాన్నిధ్యముంది. కనుక ఎలిసబేతు తన చిన్నరికాన్ని మరియు పెద్దరికాన్ని గుర్తించి విస్తుపోయింది. మరియప్రాయంలో తనకంటె చిన్నదైనా అంతస్తులో తనకంటె పెద్దది.

ఎలిసబేతు మరియను చూచి ఆనందించింది. మరియలోని క్రీస్తు సాన్నిధ్యం వలన ఆశీర్వాదాన్ని పొందింది. మరియు నుండి పుట్టబోయే క్రీస్తు కొనిరాబోయే రక్షణాన్ని అందరికంటె ముందుగా తాను స్తుతించింది. క్రీస్తుకి మొదట మహిమగీతం పాడింది సన్మనస్కులు కాదు, ఎలిసబేతు -2, 14. గర్భఫలం ఆశీర్వదింపబడింది అన్న ఆమె నోటి మాటలు గొప్ప మహిమగీతం. చాలాకాలమైన తర్వాత ఒక స్త్రీ క్రీస్తుని మెచ్చుకొని నిన్ను గర్భం మోసి నీకు పాలిచ్చిన తల్లి ధన్యురాలు అని మరియను స్తుతించింది -11.27. కాని అంతకుముందే “స్త్రీలంరదిలోను నీవు ఆశీర్వదింపబడిన దానవు" అని ఎలసబేతు మరియను కీర్తించింది - 1,42. నూతవేదంలో మొట్టమొదటిసారిగా క్రీస్తనీ అతని తల్లి మరియునూ స్తుతించింది ఎలిసబేతేనని చెప్పాలి. ఆమె తన్ను తాను మరచిపోయి, తన్ను తాను తగ్గించుకొని, ప్రభువునీ, అతని తల్లినీ కొనియాడింది. ఆమె గొప్పతనం అది. ఈ ఎలిసబేతులాగ మనం కూడ మనకంటె అధికులైన వారి గొప్పతనాన్ని అంగీకరించాలి. వారి ఆధిక్యాన్ని చూచి మనం అసూయ పడకూడదు. ఇంకా, ఆయా విజయాలు సాధించి సంతోషించేవాళ్లను చూచి మనం కూడ సంతోషించాలి.

39. అన్నా- లూకా 236–39

అన్నా వృద్ధురాలు. అసలామె వయసెంత? చాలమంది వ్యాఖ్యాతల ప్రకారం ఆమె పూర్తి వయస్సు 84 మాత్రమే. ఇది కీర్తనకారుడు పేర్కొన్న పూర్ణవయస్సు -కీర్త 90, 10. కొందరు మాత్రం ఆమె వయస్సు