పుట:Bibllo Streelu new cropped.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదట వంధ్యగా వుండి తర్వాత సంసోనుని కంది -న్యాయా 13.2. ఎల్కానా భార్య అన్నా కూడ ఈలాగే సమూవేలునుకంది. ఈ శిశువులందరూ తర్వాత ప్రభు భక్తులయ్యారు. ఈ తల్లుల్లాగే గొడ్రాలయిన ఎలిసబేతు కూడ బిడ్డళ్లీ కంటుంది. ఆ శిశువు గొప్ప దైవభక్తుడౌతాడు. ప్రభువు జకరియా ఎలిసబేతు దంపతుల ప్రార్థనలను ఆలించి వారికి యోహాను అనే బిడ్డ దయచేశాడు-1, 13. యోహాను అనే హీబ్రూ పేరుకి యావే అనుగ్రహం అని అర్థం. అటుపిమ్మట ఆరు నెలలు గడిచాయో లేదో ప్రభువు మరో అనుగ్రహాన్ని దయచేశాడు. పూర్వం వృద్ధవనితయైన యెలిసబేతు గర్భాన్ని ఫలవంతం జేసిన దేవుడు ఇప్పడు నజరేతు కన్య కడుపుని పండించాడు -1, 31. దేవునికి అసాధ్యమేముంది కనుక! -1,37. ఎలిసబేతు గర్భం తాల్చిందని దేవదూత మరియకు తెలియ జేశాడు. నీ చుట్టమైన ఎలిసబేతు ముసలితనం దాకా గొడ్రాలుగా వుండి ఇప్పుడు గర్భవతి ఐందని చెప్పాడు -1,36. ఇక్కడ ఎలిసబేతు మరియకు ఎలా చుట్టమో మనకు తెలియదు. మరియు తనలాగే అద్భుతంగా గర్భవతియైన ఎలిసబేతును చూడబోయింది. మరియు దేవదూత ద్వారా యెలిసబేతు గర్భదారణ వృత్తాంతాన్ని తెలిసికొంది. కాని యెలిసబేతు పవిత్రాత్మ ద్వారా మరియు చూలాలైందని గ్రహించింది. మహోన్నతుని ప్రవక్త కాబోయే యోహాను తల్లి, దేవుని కుమారుడైన మహోన్నతుని సాన్నిధ్యాన్ని మరియలో గుర్తించింది. వెంటనే ఆమె ప్రవక్రియై "నీవు స్త్రీలందరిలోను ధన్యురాలవు. నీ గర్భఫలం ఆశీర్వదింపబడింది" అని గర్భవతియైన మరియను స్తుతించింది. ఈ గర్భఫలం క్రీస్తే. తండ్రి అతని ద్వారా నూతవేద ప్రజలకు కరుణ జూపుతాడు. ఎలిసబేతు ఓ చిన్న గుర్తువలన క్రీస్తు సాన్నిధ్యాన్ని గుర్తించింది. మరియు వందన వచనాలు వినగానే యెలిసబేతు గర్భంలోని శిశువు గంతులు వేశాడు -141. పూర్వం రిబ్కా కడుపులోని కవల బిడ్డలు కూడ ఈలాగే గంతులు వేశారని విర్తిట్లున్నాం -ఆది 25,22. ఎలిసబేతు