పుట:Bibllo Streelu new cropped.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎలిసబేతు భర్త జకరియు అబియు అనే యాజక కుటుంబానికి చెందినవాడు. ఎలిసబేతు కూడ అహరోను యాజకవంశానికి చెందింది1, 5. కనుక ఈ యిరువురు యూజక కుటుంబాలకు చెందిన వాళ్లే. దేవునికి చేరువలో వుండడం దేవాలయంలో పరిచర్యలు చేయడం యాజకుల పని. ఐతే ఈ దంపతులు కేవలం యాజక కుటుంబాలకు చెంది వుండడం వలన మాత్రమే గొప్పవాళ్లు కాలేదు. స్వీయ ప్రవర్తనం వల్ల కూడ గొప్పవాళ్లయ్యారు. ఆ యిరువురు నీతిమంతులు, దేవుని ఆజ్ఞలకు బద్దులై జీవించినవాళ్లు -1,6 బైబుల్లో "నీతి మంతుడు" అంటే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నిటిని ఖండితంగా పాటించేవాడు అని భావం -ద్వితీ 6,25. ఈలా పాటించడం యూదులు గొప్ప భక్తిగా భావించారు. మరియు భర్తయైన యోసేపు కూడ ఈ యర్ధంలోనే నీతిమంతుడు - మత్త 1, 19.

ఎలిసబేతు జకర్యా దంపతులు ధర్మబద్ధంగా జీవించినవాళ్లు, పవిత్రులు. వాళ్లకు అన్నీ వున్నాయి. సంతానం మాత్రం లేదు. యూదుల భావాల ప్రకారం, సంతానం లేని స్త్రీ దేవుని శాపానికి గురై నింద తెచ్చుకొంటుంది -1.25. కాని ఎలిసబేతుకి ఈ నింద కొలది కాలం మాత్రమే. ప్రభువు ఆమె మొరను ఆలించి ఆమెకొక బిడ్డళ్లీ ప్రసాదిస్తాడు. ఆమె అవమానాన్ని తొలగించి తన మహిమనూ, కరుణనూ వెల్లడి చేస్తాడు. పూర్వవేదంలోని పితరుల యిల్లాండ్రు, పుణ్యపురుషుల భార్యలు చాలమంది మొదట గొడ్రాళ్లుగా వుండిపోయారు. తర్వాత దేవుని కరుణ వల్ల వాళ్లకు సంతానం కలిగింది. ఈలా కలిగిన బిడ్డలు ప్రత్యేకంగా దేవుని దీవెన పొందినవాళ్లు. గొప్ప దైవభక్తులు. ఉదాహరణకు, అబ్రాహాము భార్య సారా మొదట గొడ్రాలుగా వుండి తర్వాత ఈసాకుని కంది -ఆది 16, 1, ఈసాకు భార్య రిబ్కా మొదట వంధ్యగా వుండి ఆ పిమ్మట యాకోబుని కంది –25,21. యాకోబు భార్య రాహేలు మొదట గొడ్రాలుగా వుండి తర్వాత బిడ్డల్లన్లు కంది -30, 1. మనోవా భార్య