పుట:Bibllo Streelu new cropped.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవుడు మమ్మ కరుణించుగాక అంటూ రాజు పెట్టే హింసలకు బలిఅయ్యాడు. అతని తమ్ముళ్లు కూడ అదేమార్గం పట్టారు. వాళ్లు మాకు పుత్థానం వుంది. పూర్వం మా జాతి చేసిన పాపాలవల్ల మాకు ఈ శిక్షలు వచ్చాయి. ఐనా మేము దేవుని దయపై ఆధారపడుతున్నాం అని పలికారు. వాళ్లు కూడ ఘనోరహింసలు అనుభవించి శత్రువు చేతికి బలి అయ్యారు.

ఆ తల్లి కుమారుల హింసలన్నీ కన్నులార చూస్తునే వుంది. హీబ్రూబాషలో వారిని హెచ్చరించి ప్రోత్సహించింది. దేవుడు వారికి మళ్లా జీవాన్ని దయచేస్తాడని అభయమిచ్చింది. శూన్యం నుండి అన్నిటినీ కలిగించిన దేవుడు వారి శ్రమలను గమనిస్తూనే వున్నాడని చెప్పింది. ఈ జీవితం ముగిశాక మళ్లా వుత్థానం లభిస్తుందని తెలియజేసింది. దేవుణ్ణి నమ్మమని కొడుకులకు ధైర్యం చెప్పింది. ఆమె ప్రోత్సాహం వల్లనే వాళ్లు ప్రాణాలు అర్పింపగలిగారు.

ఏడురు కొడుకుల తర్వాత ఆ ధీరనారి కూడ ఘనోరహింసలకు గురై ప్రాణాలు కోల్పోయింది. భక్తులు వేదహింసలకు జంకరనీ, వేదసాక్షి మరణం ధన్యమైందనీ తెలియజేయడానికి రచయిత ఈ కథను విపులంగా వర్ణించాడు. వేద హింసలు మన కాలంలో, మనదేశంలో కూడ వున్నాయి. ఏడురు కుమారులతో పాటు తానుకూడ వేదసాక్షి మరణంపొందిన ఈ ధీరనారి కథ ఇప్పడు మనకు కూడ ప్రేరణం పుట్టిస్తుంది.


రెండవ భాగం - నూతవేద స్త్రీలు 38. ఎలిసబేతు - లూకా 139-44

ఎలిసబేతు అనే పేరు “ఎలీషేబా" అనే హీబ్రూమాట నుండి వస్తుంది. ఈ మాటకు నా దేవుడు ప్రమాణం చేశాడు, నా దేవుడు నమ్మదగినవాడు అని అర్థం. పూర్వవేదంలో దేవుడు ప్రవక్తల ద్వారా చేసిన ప్రమాణాలు నూతృవేదంలో క్రీస్తు రాకడ ద్వారా నెరవేరాయని ఎలిసబేతు పదం సూచిస్తుంది.