పుట:Bibllo Streelu new cropped.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సైన్యాధిపతికి యూదితును చెరచాలనే కోరిక పుట్టింది. అతడు ఆమె సౌందర్యానికి పరవశుడై విందు ఏర్పాటు చేసి ఏనాడు త్రాగనంతగా మద్యంత్రాగి మత్తెక్కి పడిపోయాడు. యూదితు దేవుణ్ణి స్మరించుకొని ధైర్యంతో అతని శిరస్సు నరికి బెతూలియాకు తీసికొనివచ్చింది. సేనాపతి చావడం జూచి శత్రువులు ధైర్యం గోల్పోయి పారిపోయారు.

యూదితు బిడ్డలు లేని వితంతువు. యూదులు వితంతువులకు గౌరవం ఈయలేదు. కాని విలువలేని ఒక వితంతువు ద్వారానే దేవుడు యూదులకు విజయాన్ని ప్రసాదించాడు. ఒక ఆడగూతురు చేతిలోనే మహావీరుడు మన్నుకరిచాడు. యూదితు ఆయుధం ఆమె అందమే. ఆ ఆయుధంతోనే ఆమె వీరుడైన హోలోఫెర్నెసును గెల్చింది.

యెరూషలేమునుండి ప్రధాన యాజకుడు వచ్చి యూదితును అభినందించాడు. నీవు యెరూషలేముకి గౌరవం, మన ప్రజలకు కీర్తి, మన జాతికి పేరు చేకూర్చావని స్తుతించాడు - 13,9-10. ఆమె 105 ఏండ్లు బ్రతికి అందరి మన్ననలు పొంది పరమపదించింది. వీరవనితయైన యూదితు స్త్రీజాతికే గర్వకారణం.

37. ధీరనారి ఏడురు కుమారుల తల్లి

ఈ కథ మక్కబీయులు రెండవ గ్రంథం 7వ అధ్యాయంలో వస్తుంది. అంటియోకస్ అనే గ్రీకురాజు యూదులను మతపరంగా హింసించి బాధిస్తున్నాడు. యూదమతాన్ని నాశంజేయాలని అతని తలంపు. అతడు యూదుల ధర్మశాస్త్రం అంగీకరించని పందిమాంసం తినమని వారిని నిర్బంధం చేశాడు. లేకపోతే చావు తప్పదని హెచ్చరించాడు. ఏద్గురు సోదరులు వారి తల్లి రాజుని ఎదిరించి నిల్చారు. మేము చావడానికైనా ఒప్పకొంటాంగాని ధర్మశాస్తాన్నీ మా పూర్వుల సంప్రదాయాన్ని వివారమని స్పష్టం జేశారు.

తల్లి ప్రోత్సాహంతో పెద్దకొడుక్త మేము చావడానికి సిద్ధమయ్యాం