పుట:Bibllo Streelu new cropped.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణి పదవికి ఎదిగింది. ఐనా వినయాన్ని కోల్పోలేదు. రాజాజకు దడిసికూడ దేవుణ్ణి నమ్మి ధైర్యంగా రాజు సన్నిధిలోకి వెళ్లింది. ఆమె జాతిభక్తి మెచ్చుకోదగింది.

36. పరాక్రమం గల యూదితు

యూదితు అంటే యూదజాతి స్త్రీ అని అర్థం. ఆమె తన తెలివితేటల ద్వారా, భక్తివిశ్వాసాల ద్వారా, క్రియలద్వారా యూదజాతిని కాపాడిన ఉన్నత శ్రేణి మహిళలందరికీ సూచనంగా వుంటుంది. మిర్యాము, దెబోరా, యాయేలు, ఎస్తేరు మొదలైన పూర్వకాల మహిళ లందరూ యూదితులో ఇమిడేవున్నారు.

హోలోఫెర్నోసు అస్సిరియా రాజైన నెబుకద్నెసరు సైన్యాధిపతి. అతడు సమరియూ రాష్ట్రంలోని బెతూలియా నగరాన్ని జయించడానికి మహాసైన్యంతో వచ్చాడు. ఆనగరం కూలితే యెరూషలేము దేవాలయాన్ని నాశంజేయడం సులభం. బెతూలియా నాయకులైన ఉజ్జీయా, కార్బిస్, కార్మిస్ నగరవాసులూ శత్రువుల రాకకు తల్లడిల్లారు. నగరంలో నీళ్లయిపోయాయి. ఐదు రోజుల్లో దైవసహాయం అందకపోతే నగరాన్ని శత్రువుల వశం చేద్దామనుకొన్నారు.

కాని యూదితు నగరనాయకులను మందలించింది. మనం దేవునికి షరతులు పెట్టకూడదని హెచ్చరించింది. ప్రభువును నమ్మమని ప్రోత్సహించింది. ఆమె తనద్వారా ప్రభువు యిప్రాయేలును రక్షిస్తాడని నమ్మింది. ఆ సంగతిని ఊరిపెద్దలకు తెలియజేసింది.

ఆమె శత్రుశిబిరానికి వెళ్లి అక్కడమూడునాళ్లుంది. హోలో ఫెర్నెసు ఆమె సౌందర్యానికి ముగ్గుడై మతి కోల్పోయాడు. స్త్రీ సౌందర్యమా పురుష బలమూ ఒకదాని నొకటి ఎదుర్కొన్నాయి. కడన మొదటిదే గెల్చింది. அ3) సైన్యాధిపతితో రెండర్గాలు వచ్చేలా మాటలాడింది. ఆ మాటలకు హోలోఫెర్నెసు గెలుస్తాడని ఒక అర్థం వస్తే, అతడు నాశమై పోతాడని మరొక అర్థం వస్తుంది.