పుట:Bibllo Streelu new cropped.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాతప్రతి దొరికింది. దేవుని ఆజ్ఞలు పాటించికపోతే ప్రజలందరిమిదికి దైవశిక్ష దిగివస్తుందని దానిలో వ్రాయబడివుంది.

ఆ రోజుల్లో హుల్గా అనే ప్రవక్రీ వుండేది. ఆమె భర్త షలూము. అతడు రాజవస్త్రశాలకు అధిపతి. ఇద్దరూ దైవభక్తి కలవాళ్లు. రాజు హుల్గా వద్దకు దూతలనంపి ఈ గ్రంథంలోని బోధలు నమ్మదగినవేనా అని ప్రశ్నించాడు.

ప్రవక్తి నమ్మదగిన వేనని చెప్పింది. ఆజ్ఞలు పాటించనందున యెరూషలేము మిరాదికి దైవశిక్ష దిగివస్తుందని చెప్పింది. రాజు దైవభక్తిని జూచి ప్రభువు అతన్ని క్షమిస్తాడని వాకొంది.

ఆ రోజుల్లో యిర్మీయా మొదలైన పురుష ప్రవక్తలు వున్నారు. ఐనా రాజు దూతలను హుల్లా దగ్గరికే పంపాడు. దీనిని బట్టి ఆమె దైవభక్తి దైవజ్ఞానం కలది, యోగ్యురాలు, నమ్మదగినది అని అర్థం జేసికోవాలి. యోషీయా రాజు ఈ గ్రంథ బోధలప్రకారం సంస్కరణలను ఇంకా ముమ్మరం జేశాడు. ఆ గ్రంథాన్ని దేవాలయంలో చదివించాడు. దేవునితో ఒడంబడిక చేసికొన్నాడు.

హుల్గా దైవభక్తి కలది కనుక ప్రవచన శక్తిని పొందింది. రాజును అతని సంస్కరణలను ప్రోత్సహించింది. ఆమె నిజమైనదే అని చెప్పిన ఆ పుస్తకం ద్వితీయోపదేశ కాండం. ఈ గ్రంథం నిజమైనదే నని చెప్పడం ద్వారా ఆమె దేవుని వాక్ముకే గౌరవం ఆపాదించింది. -2రాజు 22, 14–20.

35. తన జాతిని కాపాడిన ఎస్తేరు

ఎస్తేరు అంటే సూర్యుడు. ఆమెకు హడస్సా అని మరోపేరు కూడ పంది. ఆ పేరుకి కదంబ వృక్షం అని అర్థం. ఈమె క్రీ.పూ. ఆరవ శతాబ్దంలో జీవించి వుండవచ్చు. అబీహాయిల్ పత్రిక. మొర్టెకయికి అన్న కూతురు.

అహష్వేరోషు రాజు పర్యాద్దేత్తాన్ని పరిపాలిస్తు షూషను దుర్గంలో