పుట:Bibllo Streelu new cropped.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎలీషా ఆమె యింటికి వచ్చి చనిపోయిన శవంపై పండుకొన్నాడు. అతని ప్రాణం బిడ్డల్లోకి ప్రవేశింపగా వాడి శరీరం వేడెక్కింది. వాడు ఏడుసార్లు తుమ్మి కండ్లు తెరిచాడు - 4,35. ప్రవక్త బిడ్డణ్ణీ తల్లికి అప్పగించాడు. ఆమె ఆనందంతో కుమారుణ్ణి స్వీకరించింది. ఈ గృహిణి దైవభక్తులకు ఆతిధ్యమిచ్చింది. కష్టకాలంలోగూడ దేవుణ్ణి నమ్మింది. ప్రవక్త శక్తి పట్ల పూర్ణ విశ్వాసం చూపింది. ఈమె పూర్వవేదపు భక్తురాళ్లల్లో అగ్రశ్రేణికి చెందింది. ఈ కథ 2 రాజు 4,8-37లో వస్తుంది. చదవడానికి ఇంపుగా వుంటుంది.

33. వేదబోధ చేసిన పనిపిల్ల

సిరియా సైన్యము యిప్రాయేలును ఓడించి వారి సొత్తు దోచుకొని పోయింది. వారి బాలికను ఒకతెను గూడ ఎత్తుకొని పోయింది. ఆ యువతి సిరియా దేశంలో నామాను భార్యకు దాసిఐంది. ఈ నామాను ఆ దేశానికి సైన్యాధిపతి. ఆ బాలిక సొంతదేశాన్నీ జనాన్నీ కోల్పోయినందుకు ఎంతో దుఃఖించింది. ఐనా ఆ పరాయి దేశంలోకూడ యావే ప్రభువును కొలవడం మానలేదు. ఇంటిలో తన యజమానునికీ యజమానురాలికీ, ప్రభువును గూర్చి చెప్పడానికి భయపడలేదు. విశ్వాసదీపం ఆమె హృదయంలోను వెలుపలా కూడా వెలిగింది. నామూను మహాశూరుడు. ఐనా కుష్టరోగి. ఒక దినం ఆ బాలిక యజమానురాలితో మనదొర సమరియా దేశంలోని ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన కుష్ట నయమౌతుంది కదా అంది. ఆ వాక్యం నామానుకి ఆశపుట్టించింది. అతడు తన రాజునుండి సిఫార్సు జాబు తీసికొని, ప్రవక్త కీయడానికి కానుకలు సిద్ధం జేసికొని యిస్రాయేలు దేశానికి వచ్చాడు.

ఎలీషా ప్రవక్త అతన్ని ఏడుసార్లు యోర్గానులో స్నానం చేయమని ఆజ్ఞాపించాడు. నామాను మొదట ఇష్టపడకపోయినా తర్వాత ప్రవక్త I