పుట:Bibllo Streelu new cropped.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దావీదు అతన్నిలేపి ముద్దు పట్టుకొన్నాడు. ఇద్దరు రాజీపడ్డారు -14,33.దేవుడు కూడ ఆ రాజీని అభిలషించాడు.

ఇంత చాకచక్యంగల యీ స్త్రీ పేరేమిటో బైబులు చెప్పదు. ఆ గ్రంథం మగవాళ్లు వ్రాసింది. వాళ్లు స్త్రీలకు అంతగా ప్రాముఖ్య మీయలేదు . ఈ మహిళ నేర్ప రితనం, నటనా కౌశలం మెచ్చుకోదగినవి. దేవుడు ఆమెదా తండ్రు కుమారులను రాజీపరచాడు. నేడు మనం స్త్రీల శక్తులనూ నాయకత్వాన్నిప్రోత్సహించాలి. ఈ కథా రెండు సమూవేలు 14వ అధ్యాయంలో వస్తుంది.

28. జ్ఞానాన్ని అభిలషించిన షేబరాణి

ఈ రాణి పర్ష్యన్‌ గల్ప్‌ దాగ్గరవున్న సాబదేశాధికారి. ఆమె పండ్రెండు వందల మైళ్ళు వొంటె ల మీదా ప్ర యాణం చేసి యెరూషలవేముకు వచ్చింది. ఎందుకు? సోలోమోను జ్ఞానాన్ని పరీక్షిం చి చూడ్డనికి. ఆమె రాజకీయ విషయాల్లోగాని, మతవిషయాల్లోగాని పురుషులకు ఏమాత్రం తీసిపోదు. బెబౖలు ఆమెపేరు ఏమిో చెప్పదు. ఆమె మనసులోని కోరికలు రెండు. సోలోమోను జ్ఞానాన్ని వ్యక్తిగతంగా పరిశీలించిచూడ్డం, అతడు కొలిచే యావే ప్రభువుని స్తుతించి కీర్తించడం. కావుననే సోలోమోనుతో నిన్ను యిస్రాయేలుకి రాజును చేసిన దేవునికి స్తుతి కలగాలి అంది -1 రాజు 10,9. తూర్పుదేశపు జ్ఞానుల్లాగే ఆమెకూడ జ్ఞానపిపాసి.


ఆరాణి సోలోవె ూ నుకి చాల ప్ర శ్నలువేసిం ది. అత డు వాికని flికి తృపికరంగా, జవాబులు చెప్పాడు. ఆ జవాబులకు ఆమె విస్తుపోయింది. గొప్పవాళ్లు ఒకరికొకరు చేరువౌతారు.


సేవకులు పూర్వమే ఆరాణికి సొలోమోను జ్ఞానాన్నిగూర్చి, సంపదలను గూర్చీ చెప్పారు. కావుననే ఆమె రాజును చూడ్డనికి వచ్చింది. ప్రశ్నలు వేసి అతని జ్ఞానాన్ని తెలిసికొంది. అతని

49