పుట:Bibllo Streelu new cropped.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విఫలుడయ్యాడు. గత్యంతరంలేక ఊరియాను మోసంతో యుద్ధంలో చంపించాడు. పిమ్మట ఆమెను విధ్యుక్తంగా పెండ్లాడాడు. బత్తెబ బిడ్డను కంది గాని దేవుని కోపం వల్ల వాడు చనిపోయాడు. అటుతర్వాత ఆమెకు యొదీద్యా అనే కుమారుడు కలిగాడు. ఆ పేరుకి దేవునికి ఇప్పుడు అని అర్థం. అతడే సొలోమోను.

దేవుడు దావీదును బతెబ్రను క్షమించాడు. నాతాను ప్రవక్త సహాయంతో బతెబ్ర దావీదు తర్వాత తనకుమారుడైన సొలోమోనుని రాజుని చేయగలిగింది. మరోభార్యవలన పుట్టిన అదోనియ ప్రాయంలో పెద్దవాడైనా రాజు కాలేకపోయాడు. సోలోమోను దేవాలయాన్ని నిర్మించిన రాజు. దేవునినుండి జ్ఞానవరాన్ని పొందినవాడు. అంతటి కుమారుణ్ణి కనిపెంచిన బత్తైబ్ర ధన్యురాలు.

దావీదు గతించాక అదోనియ తండ్రి ఉపపతియైన అబీషాగును పెండ్లియాడగోరాడు. బతెబద్వారానే తన కోరికను సొలోమోనుకి వెల్లడిచేయించాడు. కాని గతించినరాజు పత్నిని కోరుకోవడమంటే అతని రాజ్యాన్ని కాంక్షించడమే. కనుక సొలోమోను అదోనియాను చంపించాడు. అతడు తల్లికోరికను త్రోసిపుచ్చినా ఆమెపట్ల ఆదరభావం చూపడం మానలేదు.

నూత్నవేదం క్రీస్తు వంశావళిలో ఊరియా భార్యను పేర్కొంటుంది -మత్త 1,6. తామారు, రాహాబు, రూతులతోపాటు ఈయన్యజాతి స్త్రీ కూడ మెస్సీయా మాతామహుల జాబితాలో చేరే భాగ్యం కలిగింది.

ఒకసారి పడిపోయినా బత్షెభ పశ్చాత్తాపంచెంది యోగ్యురా లయిన తల్లిగా ప్రసిద్ధిచెందింది. ఆమె దావీదు ప్రేమకూ సొలోమోను గౌరవానికీ నోచుకొంది. దైవభక్తి గల స్త్రీ స్తుతింపబడునుగాక.31.30

27. నటనతో రాణించిన తేకొవ మహిళ

అబ్షాలోము, అమ్నోను దావిదుకి వేర్వేరు భార్యల వలన పుట్టిన కుమారులు. అమ్నోను అబ్షాలోము చెల్లెలు తామారును చెరచాడు.

చెల్లెలు తామారును చెరచాడు.