అన్యాయంగా చంపివేయడమే. గిబ్యోనీయులు సౌలు మా జాతిని నాశంజేసినందుకు మేము సౌలు కుమారులు ఏడురిని చంపి పగతీర్చుకొంటాం అని కోరారు. దావీదు సౌలుకి రిస్పావలన కలిగిన కుమారులిద్దరిని, ఇంకా సౌలు మనుమలు ఐదుగురిని గిబ్యోనీయులకు అప్పగించాడు. వాళ్లు ఈ యేడురిని బలియిచ్చారు. కాని ఆయేడురి శవాలను ఎవరూ పాతిపెట్టలేదు. యిస్రాయేలీయులు శవాలను ఖననం జేయకపోవడం పెద్ద అవమానంగా భావించేవాళ్లు రిస్పా గోనె కప్పకోని ఏడురి శవాలకు కాపుంది. పక్షులను, వన్యమృగాలను కళేబరాలచెంతకు రానీయకుండ తరిమి వేసింది. ఆరునెలలపాటు ఈలా కాపంది. ఆమె యెడద శోకంతో నిండిపోయింది. ఈ సంగతి దావీదుకు తెలిసింది. అతడు ఈ యేద్గురు కుమారుల శవాలను ఖననం చేయించాడు. రిస్పా తన కుమారుల శవాలను ఖననం చేయనందుకు దావీదుకి ධිඝරය ඕරිෆිෆයි. గోనెతాల్చి శవాలకు కాపుండి తన అసమ్మతిని తెలియజేసింది. న్యాయం కొరకు పొరాడింది. చివరకు దావీదు లొంగిపోయాడు. దుర్బలులు కూడ బలవంతులను గెలవవచ్చునని ఈ సంఘటనం నేర్పుతుంది –2సమూ 21, 1-14.
26. అందగత్తె బత్తెబ
బైబులు బత్తెబ్ర అందగత్తె అని చెప్తుంది. -2 సమూ 11, 2. ఆమె పేరుకి పూర్ణసమృద్ధి అని అర్థం. ఆమె హితీయుడైన ఊరియా భార్య ఇతడు దావీదు సైనికుల్లో వొకడు. అమ్మోనీయులతో యుద్ధం జరుగుతూండగా దావీదు ఇంటివద్ద మేడపై పచార్లు చేస్తున్నాడు. ప్రక్కింటి ఆడగూతురు బత్తెబ్ర స్నానం జేసికొంటూ అతని కంటబడింది. రాజు ఆమెపై మరులుకొని ఆమెను తన మేడకు రప్పించుకొన్నాడు. ఆమెను కూడాడు. బత్తెబ్ర గర్భవతి ఐంది. ఆ గర్భం ఆమె పెనిమటివల్లనే కలిగిందని నిరూపింపగోరి దావీదు