పుట:Bibllo Streelu new cropped.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిస్రాయేలును ఫిలిస్టీయుల బారినుండి విడిపించడం సంసోను పని. ఫిలిస్టీయులకు అతడంటే బెదురు. కాని ఫిలిస్టీయులకు హడలు పుట్టించినవాడు వారిజాతి ఆడపడుచుకి లొంగిపోయాడు. ఆమె స్వజాతి నాయకుల నుండి 1100 వెండి నాణాలు లంచం తీసికొని సంసోనుని పట్టియియడానికి వొప్పకొంది.

స్త్రీలకుండవలసిన ఆత్మగౌరవం, ప్రేమ, జాలి డెలీలాకు ఏకోశాన లేవు. ఆమెకు కావలసింది డబ్బు. ఆమె ముఖంలో సౌందర్యం వుంది. కాని హృదయంలో విషముంది. సంసోను ఆమె శత్రుజాతిస్త్రీ, వేశ్య, మోసగత్తె అని తెలిసికూడ ఆమె వలలో చిక్కుకొన్నాడు. ఉన్నతుల పతనం గూడ ఉన్నతంగానే వుంటుంది.

డెలీలా సంసోను బలరహస్యాన్ని తెలిసికొని అతన్ని స్వీయ జాతివారికి పట్టియియాలి. కనుక ఆమె మూడుసార్లు నీ బలరహస్యం తెలియజేయమని సంసోనుని వేడుకొంది. మూడు సార్లు అతడు అబద్ధాలు చెప్పి తప్పించకొన్నాడు. నాల్గవసారి ఆమె అతన్ని పీడించింది. గుక్క త్రిప్పకోనీయలేదు. సంసోను విసిగి వేసారి తన రహస్యాన్ని తెలియ జేశాడు. నా బలం నాజరేయ ప్రతంలో వుంది. ఇంతవరకు మంగలికత్తి నాశిరోజాలను తాకలేదు. నా జట్టు కత్తిరిస్తే నాబలం ఉడిగిపోయి అందరివంటి వాణ్ణి ఔతాను అని నిజం చెప్పాడు – 16,17.

డెలీలా సంసోనును మభ్యపెట్టి తన తొడమిద నిద్రపుచ్చింది. అతని తల జడలు ఏడింటిని కత్తెర వేయించింది. అవి అతని నాజరేయ ప్రతానికి గురుతు. ఆ ప్రతం భంగంగాగానే అతని బలం నశించింది. వెంటనే ఇంటిలో దాగుకొని వున్న ఫిలిస్టీయ నాయకులు సంసోనుపై బడి అతన్ని బంధించారు. కన్నులు పెరికివేసి గాజాకు తీసికొనిపోయి గానుగమాను త్రిప్పించారు. అనగా సంసోను పశువైపోయాడు. తర్వాత డెలీలా ఏమైపోయిందో బైబులు చెప్పదు.

ఆమె వంచనకు పెట్టింది పేరు. డబ్బుకు ఆశపడి మహావీరుణ్ణి