పుట:Bibllo Streelu new cropped.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దహనబలిని అంగీకరించి వుండడని అభయమిచ్చింది. అతడు భయకంపితుడు. కాని ఆమె పూర్ణ విశ్వాసం కలది - న్యాయాధి 13.


మనోనా భార్య దేవదూత చెప్పినట్లే బిడ్డళ్లీ కని వాడికి సంసోను అని పేరు పెట్టింది. ఆ పేరుకి సూర్యుడని అర్ధం. అతడు నాజరేయువ్రతాన్ని చేపట్టి దేవునికి అంకితుడు కావడం చూచి సంతోషించింది. కాని ఆ బాలుడు పెరిగి పెద్దయ్యేకొద్ది అపమార్గం పట్టాడు. తిమ్నాతుకి చెందిన ఫిలిస్టీయయువతిని పెండ్లాడాడు. అన్యజాతి స్త్రీని పెండ్లాడినందుకు తల్లిదండ్రులు బాధపడ్డారు. దైవవరం వల్ల పుట్టిన బిడ్డడు ధర్మశాస్తాన్ని మీరడమేమిటని దుఃఖించారు. సంసోను క్రమేణ ఇంకా దిగజారిపోయి డెలీలా వలలో చిక్కుకొన్నాడు. కాని అప్పటికీ అతని తల్లిదండ్రులు గతించారు.

మనోవా భార్య దైవభక్తి కలది. దైవదర్శనానికి నోచుకొంది. సంసోనులాంటి వీరుణ్ణి కన్న ఆ వీరమాత కుమారుని దుడుకుతనానికి ఎంతో పరితపించింది.

21. వంచకురాలు డెలీలా

డెలీలా అంటే వగలు పోయేది, విడిపోయిన కురులు కలది అని అర్థం. ఆమె మోసంతో మహావీరుణ్ణి పట్టియిచ్చిన వంచకురాలు. అందుచే స్త్రీలు ఆమెపేరు పెట్టుకోవడానికి దడుస్తారు.


ఆమె ఫిలిస్టీయ ప్రీ. అందగత్తె. వృత్తిచే వేశ్య ఫిలిస్టీయ దొరలు శత్రుజాతి వీరుణ్ణి బంధించడానికి ఆమెను పావుగా వాడుకొన్నారు.

సంసోను శారీరకంగా బలాఢ్యుడైనా నైతికంగా బలహీనుడు. అతడు ముగ్గురు వనితలకు దాసుడయ్యాడు. మొదటి ఆమె ఒక వేశ్య -న్యాయాధి -16, 1. రెండవ ఆమె తిమ్నాతు యువతి. ఆమె ఫిలిస్టీయ స్త్రీ విగ్రహాలను కొలిచేది. అతడు తల్లిదండ్రుల ఆజ్ఞను ధర్మశాస్తాన్ని విూరి ఈ యన్యజాతి స్త్రీని పెండ్లాడాడు. తర్వాత ఆమెను అతని స్నేహితునికిచ్చి పెండ్లి చేశారు -14, 1–4. మూడవ ఆమె డెలీలా.