పుట:Bibllo Streelu new cropped.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యిస్రాయేలు స్త్రీలు ప్రతియేడు నాలురోజులపాటు ఆ కన్య ఆత్మార్పణం స్మరించుకొని ఆమెను కొనియాడేవాళ్లు. ఆమె త్యాగాన్ని మెచ్చుకునేవాళ్లు. తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించడంలో యెఫా పుత్రిక నేటికీ మనకు ఆదర్శంగా వుంటుంది. యెఫా అమ్మోనీయులను జయించాక చాలాకాలం వరకు శత్రు పీడ విరగడమైంది.

20. దైవభక్తి కల మనోవా భార్య

మహవీరుడైన సంసోను తండ్రి మనోవా, కాని సంసోనుతల్లి పేరేమిటో మనకు తెలియదు. బైబులు రచయితలు అంతా మగవాళ్లు. పురుషాధిక్యత వలన వాళ్లు స్త్రీల పేర్లను చెప్పలేదు. మనోవా వూరు యెరూషలేము ప్రక్కనే వున్న జోరా.

మనోవా భార్య దైవభక్తి కలది. సంపన్నురాలు. ఐనా చాలకాలం వరకు గొడ్రాలుగా వుండిపోయింది. ఈ విషయంలో ఆమె సారా, రిబ్కా అన్నా ఎలిసబేతుల్లాంటిది. సారా ఎలిసబేతులకు లాగే ఈమెకు కూడ దేవదూత నీకు బిడ్డడు పడుతాడని శుభవార్త తెచ్చాడు. ఆవార్తకు మనోవా దంపతులకు పరమానందం కలిగింది. దేవదూత సందేశానికి నోచుకొన్నారంటే ఆ దంపతులు పుణ్యజీవితం గడిపివుండాలి.

దేవదూత పుట్టబోయే బిడ్డడు నాజరేయ ప్రతాన్ని చేపట్టి దేవునికి అంకితుడు ఔతాడని చెప్పాడు. అతడు మద్యాన్ని సేవించడు. అపవిత్ర వస్తువులను భుజింపడు. మంగలికత్తి అతని తలవెండ్రుకలను తాకదు. పవిత్రుడైన శిశువుకి తల్లి కాబోతుంది కనుక ఆమెకూడ కొన్ని నియమాలను పాటించాలి.


దేవదూత దర్శనం మనోవాకు కాదు భార్యకు. పెనిమిటితో పోలిస్తే ఆమె యొక్కువ తెలివితేటలు దైవభక్తి కలది. మనోవా దైవదర్శనం వల్ల భయపడిపోయి దేవుడు తమ్ముచంపివేస్తాడేమోనని తల్లడిల్లి పోయాడు. కాని భార్య అతనికి ధైర్యం చెప్పింది. చంపివేసే వాడైతే దేవుడు మన