పుట:Bibllo Streelu new cropped.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాయేలు తనతరపున తాను అతిథిధర్మాన్ని విూరింది. ఆమె చర్యను సమర్ధించడానికి వీల్లేదు. కాని ప్రభువు ఒక అబలద్వారా మహావీరుణ్ణి మన్ను గరిపించాడు. విశ్వాసఘాతకం ద్వారానే యిస్రాయేలుకు విజయాన్ని దయచేసాడు. అతని చర్యలు మనకు అర్ధంకావు.

18. వీరనారి దెబోరా

డెబోరా గిద్యోను, యెప్తా, సంసోను, మొదలైన యుద్ధవీరుల కోవకు చెందింది. వీళ్లంతా యిస్రాయేలును శత్రువుల చేతినుండి విడిపించారు. ఆమె క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంలో ఎఫ్రాయివాము మండలంలో జీవించింది. ఆమె పేరుకి తేనెటీగ అని అర్థం. అది తెలివికి చిహ్నం. దాని కొండె శత్రువులను హతమారుస్తుంది. డెబోరా న్యాయాధిపతి, ప్రవక్రీ, యుద్ధనారి.

ఆమె లఫ్పీడోతు భార్య యిస్రాయేలుకు తల్లిలాంటిది. ఇక్కడ తల్లి అంటే సంరక్షకురాలు అని అర్థం - 5,7. ఆ వీరవనిత యిప్రాయేలు తగవులను పరిష్కరించేది - న్యాయాధి 4, 4. యిస్రాయేలుకు దేవునితోనూ, దేవునికి యిస్రాయేలుతోను పొత్తు కుదిర్చేది.

ఆ కాలంలో కనాను రాజయిన యాబీను ఇరవైయేండ్లపాటు యిస్రాయేలును పీడించి పిప్పి చేశాడు. అతని సైన్యాధిపతి మహావీరుడైన సీస్రా, దెబోరా దైవప్రేరణం వల్ల కనానీయులు యిస్రాయేలుకు ఓడిపోతారని ప్రవచనం చెప్పింది. యిప్రాయేలు వీరుడు బారాకును పిలువనంపి నీవు శత్రువుల విూదికి యుద్ధానికి వెళ్లమంది. కాని బారాకు భయపడి నీవుకూడ వస్తే నేను పోతాను. నీవు రాకపోతే నేను పోలేను అన్నాడు. దెబోరా నేనుకూడ వస్తాను. కాని సీప్రా నీ చేతికి చిక్కడు. ఒక ఆడకూతురు చేతికి చిక్కి చస్తాడు అని ప్రవచనం చెప్పింది-4,8-9. యుద్ధాన్ని ప్రేరేపించింది, దానికి సూత్రధారి దెబోరా,

బారాకు పదివేలమంది సైన్యంతోనే లక్షమందితో గూడిన L