పుట:Bibllo Streelu new cropped.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవయిత్రి, ప్రవక్రి అనుకోవాలి-నిర్గ15,21. ఆమె తొలి రోజుల్లో చాలా ప్రాముఖ్యం కలదనీ బైబులు రచయితలు మోషేకు గొప్పదనం ఈయదలచి ఆమె ప్రాముఖ్యాన్నితగ్గించారనీ కొందరు బైబులు పండితుల అభిప్రాయం. అందరు నరులకు లాగే మిర్యాముకు కూడ లోపాలు సద్గుణాలు కూడా వున్నాయి. ఆమె మోషే నాయకత్వం పట్ల అసూయ జెందింది. అతడు ఎడారిలో హజరోతు వద్ద ఓ నీగ్రో స్త్రీ ని పెండ్లాడాడు. అన్యజాతి వారిని పెండ్లాడకూడదని మిర్యాము తగాదాకు దిగింది. కాని అసలు తగాదాకు కారణం అతని నాయకత్వం పట్ల ఈర్ష్య ఆమె ప్రభువు మోషే ద్వారా మాత్రమే మాటలాడాడా? మా ద్వారా మాటలాడలేదా? అతడొకడే నాయకుడా? మేము మాత్రం కాదా? అని జగడమాడింది. కాని ప్రభువు మోషేను మాత్రమే నాయకుణ్ణిగా యెన్నుకొన్నాడు. నేను మోషేతో ముఖాముఖి మాటలాడతాను అన్నాడు. అందుచే అతడు మిర్యాము విూద కోపించి ఆమెకు కుష్టరోగం సోకేలా చేసాడు-సంఖ్యా 21,10. ఇక్కడ అహరోను మిర్యాము యిద్దరూ మోషే విూద తిరగబడినా దేవుడు మిర్యామును మాత్రమే ఎందుకు శిక్షించాడో బోధపడదు. బైబులు రచయితలు మగవాళ్లు కనుక పురుషుల పట్ల పక్షపాతం చూపి వుండవచ్చు.

అటుపిమ్మట మోషే మిర్యాము తరపున దేవునికి విన్నపం జేశాడు. ఏడునాళ్లు కుష్టరోగిగా వున్న పిదప ప్రభువు ఆమె రోగాన్ని నయం జేశాడు-12, 15. అధికారాన్ని ధిక్కరించరాదు అనడానికి ఈ సంఘటనం మంచి ఉదాహరణం. మిర్యాము చనిపోగా కాదేషు వద్ద పాతిపెట్టారు.

ఆమె గొప్పతనం మోషే శిశువుని కాపడి యిస్రాయేలు ప్రజలకు మేలు చేయడంలోవుంది. రెల్ల సముద్రం దగ్గర విజయగీతం పాడ్డంలో వుంది. యిప్రాయేలీయులు ఆమెను మాన్యురాలినిగా ఎంచారు.