పుట:Bibllo Streelu new cropped.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాచలేక పోయింది-నిర్గ2,2-3. ఆ శిశువుని ఏమి చేయాలి? దేవుదే వాణ్ణి రక్షించాలి అనుకొంది. అతనిమిదనే భారం వేసింది. ఆ బిడ్డడు ఏలాగైనా ఫరోకూతురు కంటబడేలా చేయాలనుకొంది. నైలునదిలోని తుంగతో బుట్టనల్లి దానికి జిగటమన్ను కీలు పూసింది. బిడ్డను ఆ బుట్టలో పెట్టి నైలునది తుంగల్లో వదిలిపెట్టింది. ఫరో కూతురు జలకాలాడడానికి అక్కడకి వచ్చి ఆ బుట్టను వొడ్డుకి తెప్పించింది. కాని దానిలోని శిశువును చూచి కరుణతో దత్తు తీసుకొంది. అంతా యోకెబెదు కోరినట్లే జరిగిపోయింది. కాని ఆమె దేవుని కృపవల్ల ఈ కార్యం, ఈలా జరుగుతుందని ముందుగానే నమ్మింది. దేవుని పట్ల ఆమెకున్న విశ్వాసం మెచ్చుకోదగింది.

  బుట్టకు యోకెబెదు కూతురు మిర్యాము కాపుంది . ఫరో కూతురు బుట్టతెరచి శిశువు ఏడ్పును వినగానే మిర్యాము ముందుకువచ్చి శిశువుకి పాలీయడానికి ఎవరైనా తల్లిని పిలవమంటావా అని అడిగింది. రాజకుమారి అనుమతిపై సొంతతల్లినే పిలుచుకొని వచ్చింది. తల్లే పిల్లవాడికి దాదియై పాలిచ్చి పెంచింది. యోకెబెదు విశ్వాసం ఈలా ఫలించింది.
   ఫరో కూతురు దత్తు తీసుకొన్న యోకెబెదు మోషే శిశువును ఏడేండ్ల దాకా పెంచి పెద్దజేసింది. అతనికి విద్యాబుద్దులునేర్పింది. భూమ్యాకాశాలు సృజించిన యావే ప్రభువు పట్ల భక్తివిశ్వాసాలు పుట్టించింది. యిస్రాయేలు ప్రజల సంప్రదాయాలూ, ఆ ప్రభువు అబ్రాహాముకు చేసిన ప్రమాణాలూ తెలియజెప్పింది. అతడు తర్వాత మహానాయకుడు కావడానికి దోహదం చేసింది. తర్వాత మోషే ఈజిప్టు రాజప్రాసాదంలో పెరిగాడు. యోకెబెదును గూర్చి ఇక వినం. కొడుకు ప్రసిద్దుడయ్యాక ఆమె తెరమరుగైపోయింది.
    బైబులు యోకెబెదును గూర్చి మూడు వాక్యాలు మాత్రమే చెప్తుంది-నిర్గ2, 1-3. కాని అహరోను, మిర్యాము, మోషేలాంటి సంతానాన్ని కన్న తల్లి చాలా గొప్పదైయుండాలి. ఆమె మహాకార్యాలు