పుట:Bibllo Streelu new cropped.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భయపడకుండా నదినుండి యిప్రాయేలు బిడ్డణ్ణి బయటికి తీసింది. ఆమె నైలు నదిలో తుంగల పెట్టెలో నుండి శిశువు ఏడ్పులు వింది. ఈ శిశువు హిబ్రూ ప్రజల బిడ్డడయి వుంటాడని ఊహించి జాలిగొని వాణ్ణి రక్షించి దత్తు తీసికొంది-నిర్గ 2,6-7.

       తర్వాత సొంతతల్లే ఆ బిడ్డడికి పాలిచ్చి పెంచింది. పాలు మాన్పించిన తర్వాత పిల్లవాడు రాజప్రాసాదంలోనే పెరిగాడు. అతని    పేరు మోషే, నీటినుండి కాపాడబడిన వాడని ఆ పేరుకి అర్థం. అతడు ఈజిప్టు విద్యలన్నీ నేర్చుకొని గొప్పవాడయ్యాడు. 40 ఏండ్ల దాకా రాజభవనంలోనే వసించాడు. రాజకుమారి ప్రాపువల్ల మహానాయకుడుగా ఎదిగాడు. దేవుడు ఆమెను మోషేను నాయకుణ్ణిగా తీర్చి దిద్దేలా చేశాడు.                                    
    ఈ రాజకుమారి కరుణా మూర్తి. మృదుహృదయ. మోషే శిశువుని చావునుండి కాపాడిన రక్షణమూర్తి. జాతి వివక్షలేని విశాల హృదయ. తాను రక్షించిన మోషేతోపాటు ఆమెకూడ దేవుని సన్నిధిని చేరివుండాలి. 

10. మోషేను కనిపెంచిన యోకెబెదు

  యోకెబెదు లేవీ మనుమడైన అమ్రాను భార్య. అహరోను, మిర్యాము, మోషేలకు జన్మనిచ్చిన తల్లి. ఆమె పేరుకి దేవుని మహిమ అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే ఆమె గొప్పవ్యక్తి.
  ఆమె యాజకకుటుంబంలో పుట్టింది. ఆమె కుమారుడు అహరోను యిస్రాయేలు ప్రజలకు మొదటి యాజకుడై నలభై యేండ్ల పాటు యాజకత్వం నెరపాడు. ఆమె కొమార్తె ప్రవక్త్రి. ఈమె యిప్రాయేలు విమోచనాన్ని నాట్యంతోను పాటలతోను స్తుతించింది -నిర్గ 15,20-21. ఇక మోషేలాంటి విమోచకుణ్ణి, ధర్మశాస్త్ర ప్రదాతని, మహానాయకుణ్ణి  కన్న ఆ తల్లి ఎంత ఉన్నతురాలై వుండాలి?
   యోకెబెదు విశ్వాసం చాల గొప్పది. ఫరో హీబ్రూస్త్రీలు కన్న మగబిడ్డలందరిని చంపివేయమని మంత్రసానులను ఆజ్ఞాపించాడు. యోకెబెదు మోషేను కని మూడు నెలల పాటు దాచింది. ఆ పిమ్మట

V