పుట:Bibllo Streelu new cropped.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని తప్పకొన్నారు–నిర్గ 1,19. దేవుడు ఈ స్త్రీల ద్వారా తానెన్ను కొనిన ప్రజలకు మేలు చేశాడు. ప్రభువు వారిని దీవించి వారి కుటుంబాలను వృద్ధి చేశాడు. మనం ఈ స్త్రీల మంచితనాన్ని మెచ్చుకోవాలి.

       యెరూషలేములోని ప్రధాన యాజకులు పేతురు     యోహానులను క్రీస్తుని గూర్చి బోధించవద్దన్నారు. ఆ బోధకులు మేము మీకు దడవడం కంటె దేవునికి విధేయులంగావడం మెరుగు అన్నారు-అచ 4,19. ఆలాగే ఇక్కడ ఈ మంత్రసానులు కూడ ఫరో కంటే దేవునికి విధేయులు కావడం మెరుగు అని యెంచారు. దేవుడు యిప్రాయేలు ప్రజల ప్రాణాలు కాపాడగోరి వీరిని సాధన మాత్రులుగా వాడుకొన్నాడు. 
         కొందరు బైబులు పండితులు ఈ స్త్రీలు ఈజిప్టు దేశీయులే అని చెప్తున్నారు. ఆలాగైతే వీళ్లు ఫరోకూతురు, రాహాబు మొదలైన వనితల్లాగ అన్యజాతి వారైన యిస్రాయేలు ప్రజలపై కరుణ జూపారు అనుకోవాలి. ఏమైతేనేమి, వీరి కరుణకార్యం మాత్రం మెచ్చుకోదగింది.

9. మోషే శిశువును పెంచిన ఫరో కూతురు

      ఫరోయైన రెండవ రమేసెస్ కూతురు మోషే శిశువుని పెంచి పెద్ద చేసింది. ఆ కరుణా హృదయ పేరేమిటో బైబులు చెప్పదు. మోషే యిస్రాయేలుకు రక్షకుడు. కాని యీమె మోషేకే రక్షకురాలు. అతని ద్వారా యిస్రాయేలు ప్రజలకు కూడ రక్షకురాలు.
      నైలు నది నీటికి వ్యాధులను నయంజేసే శక్తీ, గర్భాన్నిచ్చే శక్తీ వుంటాయని చెప్పకొనేవారు. ఫరోకూతురు ఈ నదికి స్నానం చేయడానికి వచ్చింది. దేవుడు అన్యజాతి వాడయిన కొరేషు రాజును యిస్రాయేలు ప్రజను బాబిలోనియా ప్రవాసం నుండి విడిపించడానికి సాధనంగా వాడుకొన్నాడు. ఆలాగే ఈ యన్యజాతి స్త్రీని గూడ మోషేను కాపాడ్డానికి ఉపకరణంగా వాడుకొన్నాడు. అటుతర్వాత మోషే ప్రజలను దాస్యంనుండి విడిపిస్తాడు. ఫరో క్రూరంగా యిస్రాయేలు శిశువులను నదిలో త్రోయండని ఆజ్ఞాపించాడు. కాని యీమె తండ్రి ఆజ్ఞకు కూడ