పుట:Bibllo Streelu new cropped.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోడలు సంతాన వాంఛతో అతన్ని కూడింది. వేశ్యలా నటించిందేగాని నిజంగా వేశ్యలా ప్రవర్తించలేదు.

         తామారుకు పెరెసు, జరా అనే కవల పిల్లలు పుట్టారు. పెరెసునుండి దావీదు, క్రీస్తు జన్మించారు.
         తామారు నీతి లేని దుష్టురాలు కాదు.దైవ ప్రేరణం వల్ల  సంతానం కొరకు అన్ని తిప్పలు పడింది. ఈ విషయంలో రూతుకూ ఆమెకూ కొన్ని పోలికలున్నాయి. యూదా తామారులు క్రీస్తు వంశావళిలో చేరిపోయారుమత్త 1,3. కనుక ఆమె మాననీయురాలే. ఆమె అన్యజాతి స్త్రీ. క్రీస్తు వరప్రసాదం అన్యజాతి వారిని సోకి వారిని గూడ రక్షించింది.  

8. యిస్రాయేలు శిశువులను కాపాడిన మంత్రసాసులు


షిప్రా, పూవా ఈజిప్టులోని మంత్రసానుల బృందానికి నాయకురాళ్లు కావచ్చు. దేవుని అనుగ్రహం వలన ఈజిప్టులో యిప్రాయేలు ప్రజలు తామరతంపరగా పెరిగిపోతున్నారు. ఆ దేశపురాజు ఫరో వీళ్లను ఈలా పెరగనిస్తే ఈ బానిసలు ఎప్పడైనా తనకు ఎదురు తిరగవచ్చునని భయపడ్డాడు. కనుక అతడు హిబ్రూ స్త్రీలకు పుట్టిన మగ బిడ్డలందరిని పురిటిలోనే చంపివేయండని మంత్రసానులను ఆజ్ఞాపించాడు. ఆడబిడ్డలను మాత్రం బ్రతక నీయండని చెప్పాడు. ఇది క్రూరమైన ఆజ్ఞ. మంత్రసానులు హీబ్రూస్త్రీలే. కనుక వాళ్లు ఒకవైపు, రాజాజ్ఞను పాటించలేక మరోవైపు స్వీయజాతి శిశువులను చంపలేక బాధపడిపోయారు. వాళ్లు దేవునికి భయపడి రాజాజ్ఞను విూరారు. మగశిశువులను చంపలేదు. రాజు శిశుహంత ఐతే ఈ స్త్రీలు శిశుసంరక్షకులు అయ్యారు.


ఫరో విూరు నాయాజ్ఞను ఎందుకు పాటించలేదని వారిని దబాయించాడు. ఆ స్త్రీలు అయ్యా! హిబ్రూస్త్రీలు ఈజిప్టు స్త్రీలకంటె బలము కలవారు. మేము వెళ్లక ముందే ప్రసవిస్తున్నారు. మేమేమి చేయగలం