పుట:Bibllo Streelu new cropped.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హాగరు పీడిత, బాధిత. అపరాధం చేసినదానికంటె అధికంగా అపరాధానికి గురైంది. దేవుడు అందరి కష్టాలను గమనిస్తూనే వుంటాడు. అందరి ఆక్రోశాలను వింటూనే వుంటాడు. అన్నీ గమనించి, అన్నీ వినే దేవుడు ఆ తల్లీ కుమారులపై దయజూపాడు. పైగా అతడు ఒక్కొక్కరికి ఒక్కోమార్గాన్ని నిర్ణయిస్తాడు. ఈసాకుని ఒక త్రోవలో, యిష్మాయేలుని ఇంకోత్లోవలో నడిపించాడు. ఇంకా, దేవుడు ఆనాడు హాగరుకి లాగే నేడు మనకు కూడ కష్టాల్లో అనుభవానికి వస్తాడు.

                                                                                                                                                 నూత్నవేదంలో పౌలు భక్తుడు సారాను వరప్రసాదానికీ హాగరును ధర్మశాస్త్రానికి ప్రతీకలను చేశాడు. హాగరు పూర్వవేదాన్నీ సీనాయి నిబంధనాన్నీ సూచిస్తే, సారా నూత్నవేదాన్నీ నూత్న నిబంధననూ సూచిస్తుందని చెప్పాడు. హాగరు ధర్మశాస్త్రపు బానిసాన్నీ, సారానూత్నవేదపు స్వేచ్ఛనీ తెలియజేస్తారని నుడివాడు - గల 4,21-28.

4. పక్షపాతం గల తల్లి రిబ్కా

                     పుట్టుపూర్వోత్తరాలు
              రిబ్కాఅంటే హిబ్రూలోగొడ్లను కట్టివేసే త్రాడు, లేక దాని వుచ్చు. స్త్రీల పరంగా వాడినపుడు ఈ మాటకు ఆకర్షణ శక్తి కలది అనే అర్థం వస్తుంది. రిబ్కాలో ఈసాకుని ఆకర్షించేశక్తి బాగానేవుంది. ఆమె అబ్రాహము సొదరుడైన నాహొరు మనుమరాలు. బెతూవేలు కూతురు. లాబానుకి చెల్లెలు.
              రిబ్కా కథ ఆదికాండ 24లో వస్తుంది. ఇది బైబుల్లోని అతి ప్రశస్తమైన అధ్యాయాల్లో వొకటి. అబ్రాహాము తనకుమారుడైన ఈసాకుకి పెండ్లి చేయగోరి సేవకుడైన యెలీయసేరుని హారాను మండలానికి పంపాడు. అతడు నాహొరు అనే వూరికి వెళ్లి అచటి దిగుడు బావి దగ్గర ఆగాడు. సాయంకాలం నీళ్లు తొడుకొని పోవడానికి రిబ్కా ఆ బావిదగ్గరికి వచ్చింది. ఆమె ఎలీయసేరుకి త్రాగడానికి నీళ్లిచ్చింది. అతని

QTD