పుట:Bibllo Streelu new cropped.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె వినయవిశ్వాసాలకు విస్తుపోయి అమ్మా! నీవిశ్వాసం గొప్పది. నీ బిడ్డ బ్రతుకుతుంది పో అని చెప్పాడు. ఇక్కడ క్రీస్తు ఈ యన్యజాతి స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు - మత్త 15,21-28.

క్రీస్తుని సిలువ వేయడానికి తీసికొని పోయేటప్పడు యెరూషలేము పుణ్యస్త్రీలు అతనిపై సానుభూతి చూపిస్తూ పెద్దగా ఏడ్చారు. క్రీస్తు వారి సద్భావాన్ని గుర్తించి మీరు నా కొరకు సంతాపపడవద్దు, మీ బిడ్డల కొరకు దుఃఖించండి అన్నాడు. అనగా త్వరలోనే రోమనులు యెరూ షలేమును నాశం చేస్తారు. అప్పడు యూదస్త్రీలూ వారిబిడ్డలూ నానా యాతనలకు గురౌతారు. కనుక ఆ తల్లులు ముందుగానే తమ బిడ్డలకొరకు ఏడ్వాలని భావం. ఇక్కడ పుణ్యస్త్రీలు క్రీస్తుపట్ల చూపిన జాలికంటే అతడు వారిపట్ల చూపిన జాలి గొప్పది - లూకా 23,2728. 4. స్త్రీల కొరకు అద్భుతాలు చేయడం

ప్రభువు స్త్రీలపై జాలికలిగి అద్భుతాలు చేసి వాళ్ల వ్యాధిబాధలను తొలగించాడు. మగ్గలమరియకు ఏడుదయ్యాలు వున్నాయి. ఇక్కడ ఏడు దయ్యాలంటే అర్థం యేమిటి? యూదుల భావాల ప్రకారం ఏడు పరిపూర్ణతను తెలియజేస్తుంది. అనగా మరియు పూర్తిగా దయ్యం అధీనంలో వుందని భావం. కనుక ఆమె పరిస్థితి దారుణంగా వుండి వుండాలి. ప్రభువు ఆ ప్రీపై జాలి గలిగి ఆమె నుండి పిశాచాన్ని పారదోలాడు - లూకా 8,2. రక్తస్రావరోగి ప్రభువు దివ్యశక్తిని నమ్మి అతని అంగీ అంచుని ముట్టింది. వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ప్రభువు ఆమె నమ్మకాన్ని మెచ్చుకొని కుమారీ! నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. ఇక సమాధానంగా వెళ్లు అన్నాడు -లూకా 8,48. ఆలాగే 18 ఏండ్లపాటు పిశాచ పీడనకు గురియై వంగిన నడుముతో బాధపడుతూన్న స్త్రీకి గూడ ప్రభువు ఆరోగ్యం దయచేశాడు - లూకా 13, 10-13. L