పుట:Bibllo Streelu new cropped.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధిక్కరించింది. అందుచే సారా ఆమెను కఠినంగా శిక్షించింది. సవతి పోరు ఆమెను అదుపు తప్పేలా చేసింది.

                                        ఈసాకు జననం
       అబ్రాహాము అతని యింటి వాళ్లందరూ సున్నతిని పొందారు. దేవుడు నేను యిష్మాయేలుతో నిబంధనం చేసికోను, నీకు కలగబోయే మరోకుమారునితో నిబంధనం చేసికొంటాను అని చెప్పాడు. అతడే దేవుడు వాగ్గానం చేసిన ఈసాకు. తన వాగ్దానాన్ని ధ్రువపరుస్తూ అబ్రాము అనే పేరును అబ్రాహాము గాను, సారయి అనే పేరుని సారాగాను మార్చాడు-17,5.15.
       దేవుని వాగ్దానం నెరవేరుతుంది అనడానికి సూచనంగా ముగ్గురు దేవదూతలు బాటసారుల్లాగ వచ్చి అబ్రాహాముని సందర్శించి నీకు ఏడాదిలోపలే బిడ్డడు కలగుతాడని చెప్పారు. ఆ పలుకులకు అబ్రాహాము నవ్వాడు-27, 17. సారా కూడ నవ్వింది–18, 12. ఆ నవ్వుల ఫలితమైన బిడ్డదే ఈసాకు. ఆ పేరుకి నవ్వు అనే అర్థం. అబ్రాహాము నవ్వులో కృతజ్ఞతా విశ్వాసమూ వున్నాయి. కాని సారా నవ్వులో విశ్వాసం లేదు. ఆమె ఈ ముసలి ప్రాయంలో పిల్లవాడు పుట్టడమేమిటని సందేహించింది.
       ఒకసారి ఈసాకు యిష్మాయేలు కలసి ఆడుకోవడం జూచి సారా యిష్మాయేలు తండ్రి ఆస్తిలో భాగం పంచుకొంటాడేమోనని భయపడింది. ఆ తల్లీ కొడుకులను వెంటనే యింటినుండి వెళ్లగొట్టమని భర్తను ఆజ్ఞాపించింది. అతడు ఆలాగే చేశాడు. దేవుడు ఈసాకు ద్వారా మాత్రమే అబ్రాహాము సంతానాన్ని లెక్కలకు అందని రీతిగా వ్యాప్తి జేయు గోరాడు-21, 10.
       అటుతర్వాత సారాకు మరోకష్టం ఎదురైంది. దేవుడు ఈసాకును బలియియమని కోరాడు. ఈ సంఘటనం ఆమె హృదయాన్ని కలచి వేసింది. కాని యీసాకు బ్రతికి యింటికి వచ్చినపుడు ఆమె బాధ ඕරියයි.
                     ముగింపు                                          
                  సారా భర్త ప్రేమకు, కూమారుని ఆదరణకు నోచుకొని పండు