పుట:Bibllo Streelu new cropped.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈజిప్టుకు వలస పోయారు. అబ్రాహాము భార్యతో నీవు రూపవతివి. ఈ దేశప్రజలు నిన్ను వుంచి నన్ను చంపివేస్తారు. నిన్ను దక్కించు కొంటారు. కనుక వారితో నేను నీకు భర్తనని చెప్పకు. సోదరుడనని చెప్ప అని నుడివాడు. సారా అలాగే చేసింది-12, 11-13. హిబ్రూ ప్రజల జానపద కథల్లో స్త్రీలందరిలోనూ అందగత్తె ఏవ. ఆమె తర్వాత సుందరాంగి సారా. 90ఏండ్ల వయసులో కూడ ఆమె ఆకర్షణ ఏమీ తగ్గలేదు. ఈజిప్టులో వుండగా ఫరో ఆమెను మోహించి తన రాణివాసానికి కొనిపోయాడు. కాని దేవుడు ఫరోను శిక్షించి సారాను మళ్లా అబ్రాహాము దగ్గరికి చేర్పించాడు. ఆరాజు అతనికి కాన్కలు కూడ అర్పించాడు -12, 18–20.

     అబ్రాహాము ఫిలిస్టీయుల దేశంలోని గెరారులో వసించేపుడు కూడ ఇదే సంఘటనం జరిగింది. ఆ దేశపు రాజయిన అబీమెలెకు ఆమెపై మరులుకొని తన అంతఃపురానికి కొనిపోయాడు. కాని దేవుడు భయపెట్టగా అతడు సారాను తిరిగి భర్త దగ్గరికి పంపాడు - ఆది 20, 7. ఈ రెండు సంఘటనల్లోను పై దంపతులు మేము సోదరీ సోదరులమని అబద్ధం చెప్పడం వల్లనే చిక్కు వచ్చింది. ఇక, పై రెండు సంఘటనలు ఒకే సంఘటనమైవుండవచ్చునని బైబులు పండితుల అభిప్రాయం.
                  హాగరుతో పోరు

అబ్రాహాముకి చాల కాలం వరకు సంతానం కలగలేదు. సారాకు 90 ఏండ్లు. ఒకవైపు దేవుని వాగ్దానం వున్నా తనకిక సంతానం కలుగుతుందన్న నమ్మకం లేదు. కనుక సారా తన దాసియైన హాగరును అబ్రాహాముకు రెండవభార్యగా సమర్పించి ఆమె వలన కలిగిన బిడ్డణ్ణీ తాను దత్తు తీసికోవాలనుకొంది. భర్త ఆమె ప్రణాళికకు అడ్డు చెప్పలేదు. అతనికి హాగరు వలన కలిగిన బిడ్డదే యిష్మాయేలు. ఐతే బిడ్డళ్లీ కనినందున పొగరెక్కి హాగరు యజమానురాలిని

-6-