పుట:Bibllo Streelu new cropped.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవేశ పెట్టింది ఏవ కాదు, ఆదాము-రోమా5,19, పౌలే క్రీస్తు తిరుసభల సంబంధాన్ని ఆదాము ఏవల సంబంధంతో పోల్చాడు. ఇంకా పితృపాదులు మరియను రెండవ ఏవ అని పేర్కొన్నారు. ఇవి మెప్పుకోలు మాటలు. బైబులు పండితులు ఆదామేవలు చారిత్రిక వ్యక్తులా లేక కేవలం సంకేతాలా అని వాదిస్తుంటారు. వీళ్లు చారిత్రక వ్యక్తులే. నరుల పతనాన్ని రక్షణను వర్ణించడానికి పరిశుద్ధ రచయిత ఈ పాత్రలను పేర్కొన్నాడు. కాని అతడు వారిని ఆధారంగా తీసుకొని కొన్ని సంకేతాలు కూడ అల్లాడు.

ముగింపు

ఆదాము ఏవల చరిత్ర మనందరి చరిత్ర కూడ. ఆదిదంపతులు పరస్పరం సహాయం చేసికొన్నారు. ఈ సూత్రం నేటి మన సమాజంలోని స్త్రీ పురుషులకు కూడ వర్తిస్తుంది. ఏవ జీవమిచ్చే తల్లి, నేటి మన తల్లులు కూడ జీవనదాతలే. కాని ఏవ మనందరికీ మొదటి తల్లి. ఆది దంపతుల్లోలాగే మనలో కూడ దేవుని పోలిక వుంది. దేవుని ఆజ్ఞలు పాటించి అతనికి విధేయులంగావడం ద్వారానే మనం ఈ పోలికను సార్థకం జేసికొంటాం. ఆదిదంపతులు పాపం ద్వారా పడిపోయినా నాశమైపోలేదు. నేడు మనం కూడ పాపంలో పడిపోయినా క్రీస్తుద్వారా రక్షణం పొందుతాం. దేవుడు ఆదిమానవుల పట్ల లాగే మన పట్లగూడ కరుణ జూపుతాడు.

2. జాతులకు తల్లి, సారా

సారా మొదటి పేరు సారయి. రాజకుమారి అని ఈ పేరుకి అర్ధం. ఇదే పేరుకి తగాదాకోరు అని కూడ అర్ధం చెప్పవచ్చు. ప్రభువు సారయి అనే పేరుని సారాగా మార్చాడు. ఈ రెండవ పేరుకి పరిపాలకురాలు, రాణి అను అర్థం. ప్రభువు ఆమెను దీవించి ఆమె నుండి పెక్కు జాతులు, రాజులు ఉద్భవించేలా చేశాడు -ఆది 17,15-16. అబ్రాహాము పెక్కు జాతులకు తండ్రి. ఐతే సారా బహుజాతులకు, రాజులకు జన్మనిస్తుంది. ఈ రాజుల కోవలోనే తర్వాత మెస్సీయు పుడతాడు. GD