పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయనా! నీవు యువకుడివిగా వున్నప్పడు
నీ యారోగ్యాన్ని కాపాడుకో
అన్యకాంతలనుగూడి నీ బలాన్ని వమ్ముజేసికోకు
దేశంలో సారవంతమైన క్షేత్రాన్ని వెదకి
దానిలో నీ సొంత బీజాలను వెదజల్ల
నీ మంచి విత్తనాలను నీవు నమ్మాలి
అప్పడు నీ బిడ్డలు
తాము మంచికుటుంబంలో పుట్టామని నమ్మి
పెరిగి పెద్దవారై వృద్ధిలోకి వస్తారు
ఉంపుడుకత్తె ఉమ్మివలె హేయమైంది
వ్యభిచారిణియైన భార్య తన ప్రియలకు చావు తెస్తుంది
దుర్మార్ణునికి అతనికి తగినట్లే
భక్తిహీనురాలైన భార్య లభిస్తుంది
దైవభీతికల నరునికి భక్తిగల భార్య దొరుకుతుంది
సిగ్గుమాలిన భార్య తనకు తానే
అవమానం తెచ్చుకొంటుంది
కాని శీలవతియైన భార్య
తన భర్త యెదుటకూడ సిగ్గుపడుతుంది - సీరా 26, 19-24

పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని చూచి మతి పోగొట్టుకో గూడదు. తొలి పాపానికి స్త్రీయే కారణం. ఆ పాపంవల్లనే నరజాతికి చావు ప్రాప్తించింది.

సౌందర్యానికి బ్రమసిపోవద్దు
అతివను జూచి మతి కోల్పోవద్దు
దుష్ణురాలైన భార్యవలన భర్తకు
విషాదమూ విచారమూ హృదయవేదనా కలుగుతాయి
పాపం స్త్రీతోనే ప్రారంభమైంది
ఆమె మూలాన మనమందరం చావవలసి వచ్చింది. - సీరా 25,21-24.

పరస్త్రీ సాంగత్యం మొదట తేనెలా తీయగా వుంటుంది. అటుతర్వాత విషముష్టిలా చేదుగా వుంటుంది. ఆమె తన వెంటబోయేవాడ్డి మృత లోకానికి గొనిపోతుంది. రంకులాడి దగ్గరికి వెళ్ళేవాడు ఆస్తి, గౌరవం, చివరకు ప్రాణాలు కూడ పోగొట్టుకుంటాడు. పురుషుడు సొంత భార్యతో సుఖమనుభవించాలికాని పరస్త్రీతో కాదు.